రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. వాయిదా! | tommorrow telangana assembly session start | Sakshi
Sakshi News home page

రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. వాయిదా!

Sep 22 2015 7:33 PM | Updated on Jun 4 2019 8:03 PM

రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. వాయిదా! - Sakshi

రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. వాయిదా!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభకానున్నాయి. ఈనేపథ్యంలో ఇటీవల మరణించిన భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభకానున్నాయి.  ఈనేపథ్యంలో ఇటీవల మరణించిన భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు.

మరోపక్క, అబ్దుల్ కలాం మృతిపట్ల మండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సంతాప తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం సభ వాయిదా పడి తిరిగి 29న నుంచి ప్రారంభంకానుంది. బక్రీద్కు రెండు రోజులు, వినాయక నిమజ్జనానికి రెండు రోజులు సెలవులు కారణంగా 29న సభలు తిరిగి ప్రారంభిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement