సభ నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల వాకౌట్‌.. | Telangana Assembly Budget Session Mar 26th Live Updates | Sakshi
Sakshi News home page

సభ నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల వాకౌట్‌..

Published Wed, Mar 26 2025 10:27 AM | Last Updated on Fri, Mar 28 2025 3:58 PM

Telangana Assembly Budget Session Mar 26th Live Updates

Telangana Assembly Session Updates..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

సభ నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల వాకౌట్‌.. 

  • శాసనసభ నుంచి నిరసనలు తెలుపుతూ బయటకు వెళ్లిపోయిన బీఆర్‌ఎస్‌ సభ్యులు.
  • వద్దురా నాయన కాంగ్రెస్ పాలన.. 30% పాలన అంటూ నినాదాలు.
  • అసెంబ్లీ గేటు ఎంట్రన్స్‌ వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరసన. 
  • ఎం‍ట్రీ-4 వద్ద మెట్లపై కూర్చుని బీఆర్‌ఎస్‌ సభ్యుల నినాదాలు
  • అక్కడ నిరసనలు తెలుపవద్దని చీఫ్‌ మార్షల్‌ సూచనలు
  • మార్షల్స్‌తో బీఆర్‌ఎస్‌ సభ్యులు వాగ్వాదం 

 

మంత్రి పొన్నం ప్రభాకర్‌ కామెంట్స్‌..

  • దళితుడు అనే భట్టి విక్రమార్కపై విమర్శలు చేస్తున్నారు.
  • గతంలో సీఎల్పీ లీడర్‌గా ఉన్నప్పుడు కూడా ఇలానే కామెంట్స్ చేశారు.
  • దళితుడు ఆర్థిక మంత్రిగా ఉండొద్దు అని ప్రతిపక్షం అనుకుంటుందా?
  • గతంలో సీఎల్పీ లీడర్‌గా దళిత లీడర్ భట్టి విక్రమార్క ఉన్నప్పుడు విమర్శలు చేశారు.

తెలంగాణ శాసనసభలో కమీషన్లపై రచ్చ..

  • అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం.
  • 40, 30, 20 శాతం ప్రభుత్వం కమీషన్లు తీసుకుంటుందన్న బీఆర్‌ఎస్‌, కేటీఆర్‌


బీఆర్‌ఎస్‌ వ్యాఖ్యలను ఖండించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • కమీషన్లపై స్పందించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.
  • గత ప్రభుత్వం పెట్టిన 40,000 కోట్ల బకాయిలను కట్టడానికి నాన్న తంటాలు పడుతున్నాం.
  • ఒక స్టేట్‌మెంట్ ఇచ్చినప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.
  • గత ప్రభుత్వం లాగా వ్యవహరించడం లేదు.
  • దోచుకోవడానికి మేము అధికారంలోకి రాలేదు.
  • ప్రతిపక్షం వెంటనే క్షమాపణ చెప్పాలి.
  • ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదు.
  • కమీషన్లు తీసుకున్నట్లు నిరూపించాలి.
  • సభలో కమీషన్లపై ఆధారాలతో చూపించాలి.
  • కేటీఆర్ ఆధారాలు నిరూపించకపోతే క్షమాపణ చెప్పాలి.
  • కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి.
  • కేటీఆర్ ను నేను ఎక్కడ విమర్శించలేదు
  • సభలో మాట్లాడేటప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని మాత్రమే అన్నాను.
  • కేటీఆర్‌పై నేనెక్కడా అన్ పార్లమెంటరీ పదాలను ఉపయోగించలేదు

 

  • శాసనసభలో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసనలు.
  • డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ నిరసన.
  • కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆందోళన.

 

ఇరుపక్షాలకు సర్ది చెబుతున్న ప్యానెల్ స్పీకర్

  • కేటీఆర్ వ్యాఖ్యలతో గొడవ మొదలైంది.
  • అన్ పార్లమెంటరీ పదాలు ఉంటే రికార్డుల నుంచి తొలగిస్తాం.
  • సీనియర్ సభ్యులుగా ఉండి నిరసన చేయడం కరెక్ట్ కాదు.
  • కేటీఆర్ అన్‌ పార్లమెంటరీ పదాన్ని వాడారు
  • కేటీఆర్ వ్యాఖ్యలకు ఆవేదనతో డిప్యూటీ సీఎం మాట్లాడారు.

 

కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్ చాట్..

  • నేను పని మీదే దృష్టి పెట్టా.. సోషల్ మీడియా విమర్శలను పట్టించుకోను.
  • మంత్రి వర్గ విస్తరణ కూడా పట్టించుకోలేదు..
  • మొదటి కేబినెట్ సమయంలో కూడా నేను మంత్రి పదవి అడగలేదు.
  • గద్దర్ అవార్డులను భట్టి చూసుకుంటుంన్నారు.

 

మంత్రి భట్టి విక్రమార్క కామెంట్స్‌..

  • భూములపై రైతులకు హాక్కు కల్పించింది కాంగ్రెస్..
  • భూ రక్షణ కోసం ఏదైనా జరిగింది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందే.
  • కబ్జా కాలం ఇచ్చి పేదలకు హక్కులు ఇచ్చాం.
  • ధరణితో పేదల భూములను బీఆర్ఎస్ లాక్కుంది.
  • భూస్వాముల చట్టం ధరణి.
  • ధరణి మారుస్తాం అని చెప్పాం.. చేసి చూపిస్తున్నాం.
  • లక్షల ఎకరాల భూములు వివాదంలో ఉండడానికి కారణం బీఆర్ఎస్.
  • రైతుల హక్కులను కాల రాసారు.


మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్‌..

  • ధరణి రెఫరెండంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాం.. ప్రజలు తీర్పు ఇచ్చారు.
  • ధరణితో బీఆర్ఎస్ సభ్యులు ఇబ్బంది పడ్డారు.
  • భూ భారతి కాన్సెప్ట్ తో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పోతాం..
  • ధరణి తప్పిదాలను బీఆర్ఎస్ ఎందుకు ఒప్పుకోవడం లేదు.
  • భూ భారతిని రెఫరెండంగా తీసుకుంటాం..
  • ఎవరిని ఆదరిస్తారో చూద్దాం.

పల్లా రాజేశ్వర్ రెడ్డి కామెంట్స్‌..

  • భూ భారతి అయితదో.. భూ హారతి అయితదో చూద్దాం..
  • భూ భారతి రెఫరెండం కాదు.. ఆరు గ్యారెంటీల రెఫరెండంతో ఎన్నికలకు వెళ్లండి.
  • అనుభవదారుడి కాలంతో మళ్ళీ వివాదాలు వస్తాయి.


మంత్రి పొంగులేటి కామెంట్స్‌.. 

  • అసత్యాన్ని సత్యాన్ని చేసేందుకు పల్లా ప్రయత్నం చేస్తున్నారు.
  • 2020న ధరణి చట్టం తీసుకువచ్చి.. 2023 వరకు రూల్స్ ఫ్రేమ్ చేయలేదు.
  • వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను తీసుకొస్తామని చట్టంలోనే పెట్టాం..

 

భట్టి విక్రమార్క కామెంట్స్‌..

  • జమాబందీ వల్ల లాభం తప్ప నష్టం లేదు.
  • ప్రతీ సంవత్సరం రెవెన్యూ సదస్సులు నిర్వహించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి..

 

  • సభలో పదే పదే మంత్రులకు మైక్ ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ అభ్యంతరం..
  • తాము మాట్లాడుతుంటే మంత్రులు ఎందుకు అడ్డు వస్తున్నారన్న బీఆర్ఎస్ సభ్యులు..


ప్యానెల్ స్పీకర్ రేవూరి ప్రకాష్ రెడ్డి కామెంట్స్‌..

  • మంత్రులు అడిగితే మైక్ ఇవ్వాలి.. ఇది అసెంబ్లీ రూల్స్‌లో ఉంది.
  • పదేళ్లు ప్రభుత్వం నడిపిన బీఆర్ఎస్ సభ్యులకు ఇది తెలియంది కాదు..
  • రూల్స్ ప్రకారమే సభ్యులకు అవకాశం ఇస్తున్నా..

 

బీఆర్‌ఎస్‌ సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి కామెంట్స్‌

  • ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారం జరిగితే.. పోలీసులు పట్టించుకోలేదు.
  • అడ్వకేట్‌ను హత్య చేసినా పట్టించుకోవడం లేదు..
  • క్రైం రేటు పెరుగుతోంది.

మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్‌..

  • ఎంఎంటీఎస్ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది .
  • కేసు దర్యాప్తుపై పోలీసులు దృష్టి సారించారు.
  • పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడొద్దు.


మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కామెంట్స్‌..

  • గతం గురించి మాట్లాడేది కాంగ్రెస్ సభ్యులే..
  • మేము చేసిన మంచి పనులు చెబుతున్నాం..
  • ఇంకా బాగా పని చేయాలని సూచిస్తున్నాం..

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ నిరసన.. 

  • శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన
  • కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇచ్చే హామీని అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన
  • తక్షణమే తులం బంగారం ఇవ్వాలని నినాదాలు
  • బంగారు కడ్డీలను పోలిన వాటిని ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
  • ఇప్పటివరకు పెళ్లి చేసుకున్న వారికి కూడా తులం బంగారం ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీల డిమాండ్


తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

  • శాసనసభ ఐదో సెషన్ పదో రోజు బిజినెస్
  • ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి ప్రారంభం.
  • ఉభయ సభల్లో  ప్రశ్నోత్తరాలు రద్దు
  • తెలంగాణ శాసనమండలిలో ఏడవ రోజు బిజినెస్
  • మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 2023-24 నివేదికను మండలిలో టేబుల్ చేయనున్నారు.


ప్రభుత్వ తీర్మానం..

  • శాసన  సభ ఆమోదం పొందిన రెండు బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు.
  •  సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మున్సిపల్ అమెండ్మెంట్ బిల్లు-2025 శాసనమండలిలో చర్చించి సభ ఆమోదం కోసం కోరనున్నారు
  • రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలంగాణ పంచాయతీ రాజ్ అమెండ్మెంట్ బిల్లు-2025 శాసనమండలిలో చర్చించి సభ ఆమోదం కోసం కోరనున్నారు.
  • శాసనమండలిలో తెలంగాణలో విద్య అనే అంశంపై స్వల్పకాలిక చర్చ
  • శాసనసభలో బడ్జెట్ పద్దులపై  నాలుగో రోజు చర్చ
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement