నేడు ఆర్‌యూలో జిల్లాస్థాయి యూత్‌ ఫెస్టివల్‌ | today youth fest in ru | Sakshi
Sakshi News home page

నేడు ఆర్‌యూలో జిల్లాస్థాయి యూత్‌ ఫెస్టివల్‌

Jan 24 2017 11:50 PM | Updated on Sep 18 2019 3:24 PM

స్థానిక రాయలసీమ యూనివర్సిటీలో నేడు జిల్లాస్థాయి యూత్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు.

కర్నూలు(ఆర్‌యూ): స్థానిక రాయలసీమ యూనివర్సిటీలో నేడు జిల్లాస్థాయి యూత్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. గత వారం రోజులుగా డివిజన్‌ వారీగా జరిగిన పోటీల్లో ప్రథమ స్థానంలో గెలుపొందిన విజేతలకు జిల్లాస్థాయి పోటీలను నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం సాధించే విజేతలు ఈనెల 31వ తేదీన రాజమహేంద్రవరంలోని నన్నయ యూనివర్సిటీలో నిర్వహించే రాష్ట్రస్థాయి యూత్‌ ఫెస్టివల్‌కు ఎంపికవుతారు. జిల్లా స్థాయి యూత్‌ ఫెస్టివల్‌లో భాగంగా వివిధ రకాల లలిత కళలు, వ్యాసరచన, కరిక్యులర్, కో–కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ తదితర సాంస్కృతిక పోటీలను 23 విభాగాల్లో నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ ఎన్‌.నరసింహులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement