నగరంలో శుక్ర, శని వారాల్లో రహదారి భద్రతపై జాతీయ స్థాయి వర్క్‌షాప్ జరగనుంది.
నేటి నుంచి రహదారి భద్రతపై జాతీయ సదస్సు
Aug 19 2016 12:00 AM | Updated on Aug 30 2018 4:07 PM
సాక్షి, విశాఖపట్నం : నగరంలో శుక్ర, శని వారాల్లో రహదారి భద్రతపై జాతీయ స్థాయి వర్క్‌షాప్ జరగనుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ట్రాన్స్‌పోర్ట్ అధికారులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఐదు దేశాల నుంచి వివిధ రంగాల నిపుణులు వస్తున్నారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పాల్గొంటున్నారు. మొత్తంగా దాదాపు 100 ప్రముఖులు ఒకే చోట కలిసి రెండు రోజుల పాటు రహదారి భద్రతపై విస్తతంగా చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంతో పాటు జిల్లాకు ప్రపంచ బ్యాంకు సాయంతో పాటు, కేంద్రం నుంచి వరాలు కోరాలని పాలకులు,అధికారులు భావిస్తున్నారు. విశాఖలో రూ.800 కోట్లతో జాతీయ రహదారి భద్రత సంస్థ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఈ సదస్సు వేదికగా కోరనున్నారు. అలాగే వెహికల్ టెస్టింగ్ ట్రాక్స్ నిర్మాణానికి నిధులు అడగనున్నారు. విశాఖ నగరం మధ్య నుంచి 16వ నంబర్ జాతీయ రహదారి వెళుతోంది. దానివల్ల భారీ వాహనాలు, బస్సులతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నిత్యం అనేక ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి. ఈ కారణంగా జాతీయ రహదారిని మళ్లించాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక కూడా తయారైంది. దానిని సదస్సులో ప్రదర్శించనున్నారు. తద్వారా కేంద్రం నుంచి నిధులు రాబట్టే ప్రయత్నం జరగనుంది. అదే విధంగా నగర పరిధిలో ఉన్న టోల్‌గేట్‌లను నగరం వెలుపలకు పంపించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్లాలనుకుంటున్నారు. ఇవే కాకుండా రహదారుల విస్తరణ, అధ్యయనం వంటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు సంపాదించేందుకు ఈ వర్క్‌షాప్‌ను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.
Advertisement
Advertisement