రేపు డీఆర్‌డీఏ జాబ్‌మేళా | today job mela | Sakshi
Sakshi News home page

రేపు డీఆర్‌డీఏ జాబ్‌మేళా

Aug 4 2016 12:48 AM | Updated on Sep 4 2017 7:40 AM

నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను డీఆర్‌డీఏ–ఈజీఎం జాబ్స్‌ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ రామకష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కర్నూలు(హాస్పిటల్‌): నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను  డీఆర్‌డీఏ–ఈజీఎం జాబ్స్‌ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ రామకష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు స్థానిక బి.తాండ్రపాడులోని టీటీడీసీలో జాబ్‌మేళా ప్రారంభమవుతుందన్నారు. అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ నుంచి పీజీ వరకు చదివి ఉండి,  19 నుంచి 30 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. వివిధ కంపెనీలు, సంస్థల్లో వివిధ కేడర్లలో ఉద్యోగాలు కల్పిస్తాయన్నారు. అభ్యర్థులు వారి విద్యార్హత సర్టిఫికెట్, జిరాక్స్‌ కాపీలు, ఆధార్‌కార్డులతో ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు. వివరాలకు కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌లోని డీఆర్‌డీఏ–ఈజీఎం కార్యాలయంలో సంప్రదించాలని, లేదా 08518–277499, 9014296452, 9705171923 నెంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement