వెంకట్రామరెడ్డి ఆశయ సాధనకు కృషి చేయాలి
సూర్యాపేట : రాజబహదూర్ వెంకట్రామరెడ్డి ఆశయ సాధనకు కృషి చేయాలని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.
సూర్యాపేట : రాజబహదూర్ వెంకట్రామరెడ్డి ఆశయ సాధనకు కృషి చేయాలని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రాజబహదూర్ వెంకట్రామరెడ్డి 148వ జయంతి సందర్భంగా నిర్వహించిన స్మారక క్రీడోత్సవాల్లో గెలుపొందిన విద్యార్థులకు సోమవారం పట్టణంలోని రెడ్డి హాస్టల్‌లో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వెంకట్రామరెడ్డి ఒక గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రెడ్డి హాస్టల్‌లో కేవలం ఒకే కులానికి కాకుండా అందరికి వసతి కల్పించడం అభినందనీయమన్నారు. రెడ్డి హాస్టల్‌లో యూత్ లీడర్‌షిప్ అవసరముందన్నారు. హాస్టల్‌లో చదివిన విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదిగినప్పుడు హాస్టల్ గుర్తుండేలా చేయాలని చెప్పారు. ఏ సమస్య వచ్చినా తన దగ్గరకు వస్తే తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళిక, సోమా భరత్‌కుమార్, మర్రి లక్ష్మారెడ్డి, వెదిరె రాంమోహన్‌రెడ్డి, పోరెడ్డి మధుసూదన్‌రెడ్డి, యానాల యాదిగిరిరెడ్డి, డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్రకాష్, బైరు దుర్గయ్యగౌడ్, ఆకుల లవకుశ, శనగాని రాంబాబుగౌడ్, కక్కిరేణి నాగయ్యగౌడ్, కోడి సైదులుయాదవ్, నల్లపాటి అప్పారావు, పటేల్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.