మహాసభ ఏర్పాట్ల పరిశీలన | To check the meeting works | Sakshi
Sakshi News home page

మహాసభ ఏర్పాట్ల పరిశీలన

Aug 9 2016 5:51 PM | Updated on Sep 4 2017 8:34 AM

మహాసభ ఏర్పాట్ల పరిశీలన

మహాసభ ఏర్పాట్ల పరిశీలన

సూర్యాపేట : నాటి తెలంగాణ మహాసభ స్ఫూర్తితో.. నేటి సామాజిక తెలంగాణ ఆర్తి కోసం ఆగస్టు 11న సూర్యాపేటలోని గాంధీపార్కులో నిర్వహించతలపెట్టిన తెలంగాణ ఉద్యమ సామాజిక శక్తుల మహాసభను విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమ వేదిక (టీయూవీ) జిల్లా కన్వీనర్‌ యానాల లింగారెడ్డి పిలుపునిచ్చారు

సూర్యాపేట : నాటి తెలంగాణ  మహాసభ స్ఫూర్తితో.. నేటి సామాజిక తెలంగాణ ఆర్తి కోసం ఆగస్టు 11న సూర్యాపేటలోని గాంధీపార్కులో నిర్వహించతలపెట్టిన తెలంగాణ ఉద్యమ సామాజిక శక్తుల మహాసభను విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమ వేదిక (టీయూవీ) జిల్లా కన్వీనర్‌ యానాల లింగారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని గాంధీపార్కులో మహాసభ ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. తెలంగాణ గడ్డ విముక్తి కోసం ఆగస్టు 11న 1997లో ఇదే సూర్యాపేట గడ్డపై డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ నాయకత్వంలో వేలాది మందితో మహాసభను నిర్వహించినట్లు పేర్కొన్నారు. తిరిగి ఇదే మహాసభను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఏర్పాటయ్యాక స్ఫూర్తిసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు తెలంగాణ వర్గాలు, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీయూవీ నాయకులు అనంతుల మధు, నాగేశ్వర్, కిరణ్, శేషు, వినోద్, వెంకటేష్‌ తదితరులు ఉన్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement