కాంట్రిబ్యూటరీ పింఛన్‌ విధానాన్ని రద్దు చేయాలి | To be dissolved contributary pention policy | Sakshi
Sakshi News home page

కాంట్రిబ్యూటరీ పింఛన్‌ విధానాన్ని రద్దు చేయాలి

Jul 23 2016 6:42 PM | Updated on Sep 4 2017 5:54 AM

కాంట్రిబ్యూటరీ పింఛన్‌ విధానాన్ని రద్దు చేయాలి

కాంట్రిబ్యూటరీ పింఛన్‌ విధానాన్ని రద్దు చేయాలి

అర్వపల్లి ఉపాధ్యాయుల కాంట్రిబ్యూటరీ పింఛన్‌ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్‌ విధానాన్ని కొనసాగించాలని టీఎస్‌ పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి చిప్పలపల్లి ధర్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అర్వపల్లి
ఉపాధ్యాయుల కాంట్రిబ్యూటరీ పింఛన్‌ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్‌ విధానాన్ని కొనసాగించాలని టీఎస్‌ పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి చిప్పలపల్లి ధర్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం కాసర్లపహడ్, కొమ్మాల, తిమ్మాపురం, కోడూరు, లోయపల్లి, పేరబోయినగూడెం, అర్వపల్లిలోని కేజీబీవీ, ప్రా«థమిక పాఠశాలల్లో పీఆర్‌టీయూ సభ్యత్వ నమోదును నిర్వహించారు. ఈ సందర్బంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు బి. వేమారెడ్డి, కుర్రె శ్రీనివాస్, ఎస్‌. రామకృష్ణ, పీఆర్‌టీయూలో చేరారు. పీఆర్‌సీ బకాయిలను వెంటనే చెల్లించాలని, పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులలో విద్యావాలంటీర్లను నియమించాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు డి. మహేష్, డి. యల్లయ్య, వీరేష్, నాగరాజు, రాము, మామిడి శ్రీను, లక్ష్మయ్య, సుధాకర్‌రెడ్డి, భద్రం, అశోక్‌ తదితరులు పాల్గొనారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement