విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు స్థలం కేటాయించాలని రాస్తారోకో | To allocate place for sub station | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు స్థలం కేటాయించాలని రాస్తారోకో

Jul 23 2016 5:28 PM | Updated on Sep 4 2017 5:54 AM

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు స్థలం కేటాయించాలని రాస్తారోకో

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు స్థలం కేటాయించాలని రాస్తారోకో

బక్కమంతులగూడెం (మఠంపల్లి): మండలంలోని బక్కమంతులగూడెంకు ప్రభుత్వం మంజూరు చేసిన సబ్‌స్టేషన్‌కు స్థలం కేటాయించాలని కోరుతూ సర్పంచ్, ఎంపీటీసీ, రైతులు శనివారం మట్టపల్లి–హుజూర్‌నగర్‌ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.

బక్కమంతులగూడెం (మఠంపల్లి): మండలంలోని బక్కమంతులగూడెంకు ప్రభుత్వం మంజూరు చేసిన సబ్‌స్టేషన్‌కు స్థలం కేటాయించాలని కోరుతూ సర్పంచ్, ఎంపీటీసీ, రైతులు శనివారం మట్టపల్లి–హుజూర్‌నగర్‌ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా  సర్పంచ్‌ కుంభం బొర్రయ్య, ఎంపీటీసీ మామిడి సోవమ్మ శ్రీనివాసులు మాట్లాడుతూ 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి స్థలం కేటాయించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఆరు మాసాల క్రితమే విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను మంజూరు చేసిందని, ఇందుకుగాను తమ గ్రామ సమీపంలోని డొంక వద్ద సర్వేనం. 489లో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించామన్నారు. ఆ స్థలంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని అధికారులను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి అనుమతి ఇప్పించేంత వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. కాగా విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఆకుల రమేష్‌ సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు వినకపోవడంతో తహసీల్దార్‌ యాదగిరికి ఫోన్‌ చేసి సమస్య వివరించారు. దీంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ బేత ప్రతాప్‌రెడ్డి, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ గంగసాని వెంకటరెడ్డి, బలుపునూరి వెంకటరెడ్డి, వల్లపుదాసు వెంకన్న గౌడ్, పుల్లారెడ్డి, వెంకన్న, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement