ఊట్కూర్ : శివారు పొలాల్లో చిరుత కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వివరాలిలా ఉన్నా యి. ఆదివారం ఉదయం ఊట్కూర్ చెందిన కుర్వ శ్రీనివాస్, దివాకర్ తమకున్న గొర్రెపిల్లలను తీసుకుని శివారులోని సోలార్ ప్లాంట్ సమీపంలోకి వెళ్లా రు. కొద్దిసేపటికి వారికి చిరుత కనిపించడంతో భయపడి అక్కడి నుంచి పరుగులు తీసి సెల్‌ఫోన్‌లో గ్రామస్తులకు సమాచారమిచ్చారు. వారు సంఘటన స్థలానికి వెళ్లి చూడగా దాని అగుడుజాడలు కనిపిం
ఊట్కూర్ శివారులో చిరుత సంచారం
Sep 19 2016 12:20 AM | Updated on Sep 4 2017 2:01 PM
ఊట్కూర్ : శివారు పొలాల్లో చిరుత కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వివరాలిలా ఉన్నా యి. ఆదివారం ఉదయం ఊట్కూర్ చెందిన కుర్వ శ్రీనివాస్, దివాకర్ తమకున్న గొర్రెపిల్లలను తీసుకుని శివారులోని సోలార్ ప్లాంట్ సమీపంలోకి వెళ్లా రు. కొద్దిసేపటికి వారికి చిరుత కనిపించడంతో భయపడి అక్కడి నుంచి పరుగులు తీసి సెల్‌ఫోన్‌లో గ్రామస్తులకు సమాచారమిచ్చారు. వారు సంఘటన స్థలానికి వెళ్లి చూడగా దాని అగుడుజాడలు కనిపించాయి. అలాగే పంట పొలాల్లో పనిచేస్తున్న రైతులు, వ్యవసాయ కూలీలు ఇంటిదారి పట్టారు. కాగా, 15రోజులుగా మండలంలోని జీర్ణహళ్లి, పెద్దపొర్ల, కొల్లూర్, దంతన్‌పల్లి, ఊట్కూర్ శివారు ప్రాంతాల్లోలో చిరుత సంచరిస్తున్నట్టు ఆయా గ్రామల ప్రజలు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేయడం గమనార్హం. ఇప్పటికైనా స్పందించి వెంటనే దానిని ఇక్కడి నుంచి తరలించాలని వారు కోరుతున్నారు.
Advertisement
Advertisement