ముళ్లపొదల్లో ఆడ శిశువు | Thorns bush in new born baby | Sakshi
Sakshi News home page

ముళ్లపొదల్లో ఆడ శిశువు

Aug 9 2016 10:25 PM | Updated on Sep 4 2017 8:34 AM

ముళ్లపొదల్లో ఆడ శిశువు

ముళ్లపొదల్లో ఆడ శిశువు

మండలంలోని అల్గునూర్‌ శివారులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(సీవోఈ)కు వెళ్లే దారిలోని ముళ్లపొదల్లో మంగళవారం ఓ ఆడ శిశువును స్థానికులు గుర్తించారు. కాకతీయ కాలువకు సమీపంలో సీవోఈకి వెళ్లే రోడ్డుకు ఇరువైపులో వడ్డెర కులస్తులు కూలీ పని చేస్తున్నారు.

తిమ్మాపూర్‌ : మండలంలోని అల్గునూర్‌ శివారులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(సీవోఈ)కు వెళ్లే దారిలోని ముళ్లపొదల్లో మంగళవారం ఓ ఆడ శిశువును స్థానికులు గుర్తించారు. కాకతీయ కాలువకు సమీపంలో సీవోఈకి వెళ్లే రోడ్డుకు ఇరువైపులో వడ్డెర కులస్తులు కూలీ పని చేస్తున్నారు. మధ్యాహ్నం అన్నం తినేందుకు కూలీలు రాళ్ల సమీపంలో కూర్చున్నారు. అన్నం తింటూ రాళ్ల మధ్య ఉన్న పసికందును చూశారు. సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఎల్‌ఎండీ ఎస్సై జగదీష్, కానిస్టేబుల్‌ శ్రీవాణి సంఘటన స్థలానికి చేరుకుని పసికందును 108లో స్టార్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. మంగళవారం వేకువజామున శిశువు జన్మించి ఉంటుందని,  బొడ్డు పేగు కూడా కత్తిరించలేదని, పుట్టిన వెంటనే తీసుకొచ్చి వదిలేసి ఉంటారని భావిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం శిశువు క్షేమంగా ఉందని తెలిపారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement