సైకో హల్‌చల్‌ | thief caught in the Petrol Bunk | Sakshi
Sakshi News home page

సైకో హల్‌చల్‌

Aug 28 2016 11:07 AM | Updated on Sep 3 2019 9:06 PM

చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించిన ఉమేష్‌ - Sakshi

చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించిన ఉమేష్‌

గాజులపల్లెలోని పెట్రోల్‌బంక్‌లో శనివారం ఓ సైకో(మానసిక రోగి) హల్‌చల్‌ సష్టించాడు.

గాజులపల్లె(మహానంది): గాజులపల్లెలోని పెట్రోల్‌బంక్‌లో శనివారం ఓ సైకో(మానసిక రోగి) హల్‌చల్‌ సష్టించాడు. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తెల్లవారుఝామున నాలుగు గంటలకు పెట్రోల్‌ బంకు వద్దకు వెళ్లి బీర్, టీ కావాలంటూ అక్కడున్న సిబ్బందితో గొడవకు దిగాడు. పక్కనే ఉన్న రాడ్‌తీసుకుని వారిపై దాడి చేయబోయాడు. భయపడిన అక్కడి యువకులు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి అడ్డుకున్నారు. వెంటనే ఆ వ్యక్తిని చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.  మహానంది పోలీసులు అక్కడికి చేరుకుని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దాడికి యత్నించిన వ్యక్తి మహారాష్ట్రకు చెందిన ఉమేష్‌ అని, మానసిక వ్యాధిగ్రస్తుడని ఏఎస్‌ఐ వెంకటసుబ్బయ్య తెలిపారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement