పామిడిలో చోరీ | Sakshi
Sakshi News home page

పామిడిలో చోరీ

Published Sat, Jun 3 2017 11:03 PM

theft in pamidi

పామిడి (గుంతకల్లు) : పామిడి బ్రహ్మణవీధిలోని నెట్టికంటి అనే వ్యక్తి ఇంట్లో శనివారం తెల్లవారుజామున చోరీ జరిగిందని ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం రాత్రి మిద్దెపై నిద్రించారన్నారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలోని రూ.20 వేల నగదు, 2 జతల బంగారు కమ్మలు, 15 తులాల వెండి చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Advertisement
 
Advertisement