మృగాడికి పదేళ్ల జైలు | The verdict in the case of sexual assault on woman | Sakshi
Sakshi News home page

మృగాడికి పదేళ్ల జైలు

Jan 11 2017 1:41 AM | Updated on Jul 23 2018 9:15 PM

మృగాడికి పదేళ్ల జైలు - Sakshi

మృగాడికి పదేళ్ల జైలు

మతిస్థిమితం లేని మహిళపై లైంగిక దాడి చేసి ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష,

మతిస్థిమితం లేని మహిళపై లైంగిక దాడి కేసులో తీర్పు

విశాఖ లీగల్‌ : మతిస్థిమితం లేని మహిళపై లైంగిక దాడి చేసి ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2వేల జరిమాన విధిస్తూ నగరంలోని మహిళా కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎ.వరప్రసాదరావు మంగళవారం తీర్పు చెప్పారు. జరిమాన చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు.

అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎస్‌.రామ్మూర్తినాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు పెంటా లక్ష్మణ్‌ (30) విజయనగరం జిల్లా సీతానగరం మండలం పరిధిలోని రంగంపేట నివాసి. విశాఖలోని ఆరిలోవ ప్రాంతంలో స్వధార్‌ షెల్టర్‌ హోంలో కాపాలాదారుడిగా పనిచేసేవాడు. ఈ గృహాన్ని విజయనగరం మహిళ శిశు సంక్షేమశాఖ నిర్వ హిస్తోంది. బాధితురాలు సావిత్రికి (28) మతిస్థితిమితం లోపించడంతో నగరంలోని ప్రభు త్వ మానసిక వైద్య కేంద్రంలో చికిత్స పొందా రు. 2009లో చికిత్స పూర్తయింది. ఆమెకు బంధువులు ఎవరూ లేకపోవడంతో అనాథగా గుర్తించిన అధికారులు విజయనగరం మహిళ శిశు సంక్షేమ శాఖకు సమాచారం ఇచ్చారు. ఆ శాఖ ఆదేశాల మేరకు 2009లో స్వధార్‌ షెల్టర్‌ హోంలో ఆశ్రయం కల్పించారు. అక్కడ పనిచేస్తున్న లక్ష్మణ్‌ ఆమెపై కన్నేశాడు. ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడడంతో గర్భం దాల్చింది.

దీంతో సావిత్రిని అంతం చేయాలని లక్ష్మణ్‌ ప్రణాళిక రచించాడు. ఇదే అదునుగా వసతి గృహంలో అందుబాటులో ఉన్న ప్రథమ చికిత్స బాక్సులోని అయోడిన్‌ తాగించే విధంగా ఆమెను ప్రేరేపించాడు. మతిస్థితిమితం లేకపోవడంతో అయోడిన్‌ తాగింది. అపస్మారక స్థితిలో ఉండడంతో వసతి గృహం సిబ్బంది కేజీహెచ్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ 2010 మార్చి 9న మృతిచెందింది. ఆమె మృతిపై పరీక్షలు జరిపిన వైద్యులు ఆమె గర్భిణి కావడం, అయోడిన్‌ తాగడం వల్ల మృతిచెందినట్లు నిర్థారించారు.

ఈ విషయంపై  గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసుని అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వీకరించిన పోలీసులు లోతుగా దర్యాప్తు జరపడంతో నిందితుడు లక్ష్మణ్‌ కారణమని నిర్థారించారు. సాక్షులను విచారించిన న్యాయమూర్తి లైంగిక దాడికి పాల్పడినందుకు ఏడేళ్ల జైలు శిక్ష, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు పదేళ్ల జైలు శిక్షతో పాటు రెండు నేరాల్లో వెయ్యి రూపాయల వంతుల జరిమాన విధించారు. రెండు శిక్షలు ఏకకాలంలో అమలు జరగాలని న్యాయమూర్తి ఆ తీర్పులో స్పష్టం చేశారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement