ఆర్డీటీ అకాడమీ జట్ల విజయ పరంపర | The success of the academy teams rdt | Sakshi
Sakshi News home page

ఆర్డీటీ అకాడమీ జట్ల విజయ పరంపర

Mar 6 2017 1:15 AM | Updated on Sep 5 2017 5:17 AM

ఆర్డీటీ అకాడమీ జట్ల విజయ పరంపర

ఆర్డీటీ అకాడమీ జట్ల విజయ పరంపర

అనంతపురం స్పోర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇన్విటేషన్ క్రికెట్‌ కప్‌లో ఆర్డీటీ అనంతపురం స్పోర్ట్స్‌ అకాడమీ జట్లు విజయ పరంపర కొనసాగించాయి.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: అనంతపురం స్పోర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇన్విటేషన్ క్రికెట్‌ కప్‌లో ఆర్డీటీ అనంతపురం స్పోర్ట్స్‌ అకాడమీ జట్లు విజయ పరంపర కొనసాగించాయి. రెండురోజులుగా జరిగిన టోర్నిలో అండర్‌–12, 14 విభాగాల్లో రెండేసి మ్యాచులు జరుగగా వాటని్నంటిలో విజేతగా నిలిచి అనంతపురం స్పోర్ట్స్‌ అకాడమీ జట్లు తన సత్తా చాటాయి. ప్రధాన మైదానంలో అండర్‌–14 విభాగంలో జరిగిన మ్యాచ్‌లో జైన్ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ జట్టు 90 పరుగులకే కుప్పకూలింది. అనంతపురం స్పోర్ట్స్‌ అకాడమీ బౌలర్లలో అనూష స్వింగ్‌ బౌలింగ్‌తో 3 వికెట్లు తీసింది. విఘ్నేష్‌ దినకర్‌ 3 వికెట్లు తీశాడు. అనంతరం అకాడమీ జట్టు 4 వికెట్లు కోల్పోయి 17 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. జట్టులో మణికంఠ 23, ప్రశాంత్‌ 17 పరుగులు చేశారు. బీ మైదానంలో జరిగిన రెండవ మ్యాచ్‌లో అండర్‌–12 విభాగంలో అనంతపురం స్పోర్ట్స్‌ అకాడమీ,  జైన్ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన అనంతపురం జట్టు 20 ఓవర్లలో 128 పరుగులు చేసి 1 వికెట్‌ కోల్పోయారు. జట్టులో మణిదీప్‌ 42, నిక్షిప్త్‌ మనోహర్‌ 30 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. అనంతరం బెంగుళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 121 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. అనంతపురం బౌలర్లలో కరీమ్‌బాబా 2, సునీల్‌ 1 వికెట్‌ తీశారు. బుధవారం వరకు టోర్నీ మ్యాచులు సాగుతాయని కోచ్‌ యుగంధర్‌రెడ్డి తెలిపారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement