ఎంసెట్ లీకేజీ అంశంపై రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను టి.కాంగ్రెస్ నాయకులు కలిశారు.
ఎంసెట్ లీకేజీ అంశంపై రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను టి.కాంగ్రెస్ నాయకులు కలిశారు. ఎంసెట్ పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని, బాధ్యులైన విద్యావైద్య శాఖ మంత్రులు, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌లను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినా అవినీతిని సహించనని చెప్పే సీఎం ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, డీకే అరుణ, మాగం రంగారెడ్డి తదితరనేతలు ఉన్నారు.