ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి
రాయలసీమ ప్రాంతంలో రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలు చంద్రబాబుకు పట్టడం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి కనివిప్పు కలిగేలా ఈ నెల 29న సోమవారం రైతులతో కలిసి కడప కలెక్టరేట్ వద్ద మహధర్నా చేస్తున్నట్లు మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు.
మైదుకూరు టౌన్:
రాయలసీమ ప్రాంతంలో రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలు చంద్రబాబుకు పట్టడం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి కనివిప్పు కలిగేలా ఈ నెల 29న సోమవారం రైతులతో కలిసి కడప కలెక్టరేట్ వద్ద మహధర్నా చేస్తున్నట్లు మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఎంపీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీశైలం జలాశయంలో 150టీఎంసీల నీరు నిల్వ ఉన్నప్పటికీ నీటిని కేసీ, తెలుగుగంగకు విడుదల చేయడంలో ప్రభత్వు వెనుకంజ వేస్తుందన్నారు. జిల్లాలో ఎక్కువ శాతం రైతులు కేసీ ఆయకట్టు కిందనే పంటను సాగుచేస్తున్నారని, నీరు ఉన్నా ఖరీఫ్ పంటకు పూర్తి స్థాయిలో అందిస్తారో లేదోనని రైతన్నలు భయపడుతున్నారు.
జిల్లా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా జనవరి 15వ వరకు నీటిని అందిస్తామనే హమీని ఇవ్వాలన్నారు. చంద్రబాబు రాయలసీమ పట్ల కనీస చిత్తశుద్ది లేకకుండా వ్యవహరిస్తున్నారన్నాడు. తెలుగుగంగకు నీరు అందించాలని కర్నూలులో జరిగిన ఐడీబీ సమావేశంలో కూడా అధికారులను కోరామన్నారు. చంద్రబాబు జిల్లా పర్యటకు వచ్చినప్పుడల్లా తెలుగుగంగకు 12టీఎంసీల నీరు ఇస్తా, గండికోటకు నీరు అందిస్తామని చెప్పుతున్నాడే తప్ప అది సాధ్యం కావడం లేదన్నారు. వెలుగోడు నుంచి వచ్చే కాలువలు పూర్తిగా దెబ్బతినడంతో ప్రాజెక్టులకు నీరు రావడం లేదు.. మరి చంద్రబాబు నీరు ఇస్తానని చెప్పుతున్నాడే బిందెలతో తెచ్చిపాజెక్టులతో పోస్తాడా లేక ఆకాశం నుంచి డైరెక్టుగా ప్రాజెక్టులోకి నీరు ఇస్తాడో అనేది తమకు అర్థం కావడం లేదన్నారు. సోమవారం కడప కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాలో జిల్లాలోని ఆయకట్టు రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు.


