breaking news
seema farmers
-
‘ఎత్తిపోతా’రు తస్మాత్ జాగ్రత్త
తిరుపతి అర్బన్/చంద్రగిరి: తెలుగు రాష్ట్రాల సీఎంలు, గురుశిష్యులు సీమను ఎడారిగా మార్చడానికి చీకటి ఒప్పందాలకు తెగబడ్డారని కర్షకులు కన్నెర్రజేశారు. చంద్రబాబు సర్కారుపై భగ్గుమన్నారు. ఎత్తిపోతారు తస్మాత్ జాగ్రత్త.. అంటూ హెచ్చరించారు. సాగు, తాగునీటి ప్రాజెక్టుల రక్షణలో భాగంగా రైతులు సోమవారం ఉద్యమబాట పట్టారు. సోమవారం తిరుపతిలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు రోడ్డెక్కారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద బైఠాయించి చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు అండగా రాయలసీమ ఉద్యమకారుడు, శ్వేత మాజీ డైరెక్టర్ భూమన సుబ్రమణ్యం రెడ్డి, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష మద్దతుగా నిలిచారు.‘చంద్రబాబు నోరు విప్పు–సీమ ప్రజలకు సమాధానం చెప్పు’ అనే నినాదంతో తిరుపతి కలెక్టరేట్ వద్ద నల్ల చొక్కాలు ధరించి, ఖాళీ బిందెలను చేతపట్టుకుని నిరసన గళం వినిపించారు. ప్లకార్డులతో సీఎం చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. శిష్యుడు రేవంత్‌రెడ్డి మీకు వెన్నుపోటు పొడిచారా...? లేదా ఇద్దరూ కలసి సీమ ప్రజలకు వెన్నుపోటు పొడిచారో స్పష్టంగా ప్రజలకు చెప్పాలంటూ నినదించారు.ఆ నినాదాలతో ఆ ప్రాంతం మొత్తం హోరెత్తడంతో పోలీసులు నిరసనకారులపై విరుచుకుపడ్డారు. జులుం ప్రదర్శించారు. మహిళలపైనా దురుసుగా ప్రవర్తించారు. లాగిపక్కన పడేశారు. ఈ సందర్భంగా జై జగన్... నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. పోలీసులు ఉద్యమకారులను అరెస్టు చేసి తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. సీమ ద్రోహి సీఎం చంద్రబాబు రాయలసీమ ద్రోహి సీఎం చంద్రబాబు... అంటూ వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి, రాయలసీమ ఉద్యమకారుడు భూమన సుబ్రమణ్యం రెడ్డి మండిపడ్డారు. సైంధవుడు వలే చంద్రబాబు సీమ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంల చీకటి ఒప్పందాలతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్రాయలసీమ–ఎత్తిపోతల పథకానికి రూ.7వేల కోట్లు కేటాయింపులు చేసి శ్రీశైలం, తెలుగుగంగ ప్రాజెక్టు, గాలేరు–నగరి ప్రాజెక్టులకు నీటిని అందించాలని సంకల్పించారని గుర్తుచేశారు.ఎత్తిపోతల పథకం రాయలసీమకు జీవం పోస్తుందని పేర్కొన్నారు. సాగునీరు, తాగునీరు లేకపోవడంతోనే మదనపల్లె, తంబళ్లపల్లి, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి పుణెకు రైతులు వలసపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజధాని పేరుతో అమరావతి భూములు లాక్కున్నట్లుగా ప్రాజెక్టులను తెలంగాణకు దోచిపెట్టి సీమను ఎడారిగా మార్చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సీమకు అన్యాయం చేస్తుంటే ఊరుకోబోమని, రైతుల్లో రగిలిన చైతన్యస్ఫూర్తితో మహోద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రజల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా..? : ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రజల హక్కులను కాపాడేందుకు శాంతియుత నిరసన చేస్తున్న ఉద్యమకారులను అడ్డుకోవడమే కాకుండా, అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద భూమన అభినయ్‌రెడ్డితోపాటు రైతులను పోలీçÜులు అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న గురుమూర్తి వెంటనే తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.పోలీసుల అణచివేత చర్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజల హక్కుల కోసం పోరాడే నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని, వెంటనే అభినయ్‌రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రయోజనాలకు భంగం కలిగించే నిర్ణయాలను వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అనంతరం తిరుచానూరు పోలీసులు భూమన అభినయ్‌తోపాటు 29మందిని స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. సాక్షి ఫొటోగ్రాఫర్‌పై పోలీసుల దౌర్జన్యం విధినిర్వహణలో భాగంగా రైతుల శాంతియుత నిరసన, ఉద్యమకారుల అక్రమ అరెస్టులకు సంబంధించిన ఫొటోలు తీస్తున్న ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ మోహన్‌కృష్ణపై మఫ్టీలో ఉన్న ఓ కానిస్టేబుల్ దౌర్జన్యానికి పాల్పడ్డారు. తిరుచానూరు పోలీసుస్టేషన్ వద్ద మెడపట్టి బయటకు లాగేశారు. దీంతో మోహన్‌కృష్ణ, కానిస్టేబుల్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో ఆగ్రహించిన సీఐ సునీల్‌కుమార్ స్టేషన్లో ఉన్న ఫొటోగ్రాఫర్‌ను నెట్టుకుంటూ వచ్చి బయటకు తోసేశారు.ఆపై డీఎస్పీ ప్రసాద్ ఆదేశాలతో మోహన్‌కృష్ణను పోలీసులు స్టేషన్లో రెండు గంటలకుపైగా నిర్బంధించారు. సమాచారం అందుకున్న జర్నలిస్టు సంఘాల నేతలు పెద్ద ఎత్తున పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని డీఎస్పీతో మాట్లాడారు. పోలీసు చర్యలను ఖండించారు. ఫలితం లేకపోవడంతో విషయాన్ని జర్నలిస్టు సంఘాల నేతలు ఎస్పీ దృష్టికీ తీసుకెళ్లారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఫొటోగ్రాఫర్‌ను విడిచిపెట్టారు. -
అనంతపూర్ జిల్లాలో ఆపిల్ సాగు
రాయలసీమలోని అనంతపురం అంటే మనకు ఠక్కున గుర్తొచ్చేసి కరువు.. ఎండలు.. ఎడారీకరణ జరుగుతున్న పల్లెలు.. అక్కడక్కడా కనిపించే గుళ్ళు గోపురాలు.. కొండల మాటున అక్కడప్పడా సాగయ్యే వేరుశెనగ... బెంగళూరుకు వలస వెళ్లే కూలీలు.. చలికాలంలో కూడా భగ్గున మండే ఎండలు.. ఇదంతా అనంతపురం సొంతం.. దాని బ్రాండ్.. కానీ ఇప్పుడు అనంతపురం తన రూటు మార్చుకుంటోంది. ఎక్కడో ఎముకలు కొరికే చలిలో .. మంచుకురిసే ప్రాంతాల్లో పాండే యాపిల్స్ ఇప్పుడు అనంతపురం జిల్లాల్లో పండుతున్నాయి. అదేంటి.. మంచుకురిసే ప్రాంతాల్లో పండాల్సిన యాపిల్స్ నిప్పులు కురిసే అనంతపురంలో పండుతున్నాయి.. కాలం మారింది..అనంతపురం వాతావరణం అంటే దక్షిణభారతదేశంలోనే ఒక ప్రత్యేకమైనది. ఇది భారతదేశంలోనే అత్యల్ప వర్షపాతం గల ప్రాంతం. దారుణమైన నీటి కొరతను ఎదుర్కొనే వ్యవసాయ ప్రాంతాల్లో ఒకటి. ఈ జిల్లాలో 90% కంటే ఎక్కువ భూములు .. రైతులు వాననీటిపై ఆధారపడి సేద్యం చేస్తున్నారు. ఇక్కడ వర్షం తక్కువ.. బావులు.. బోర్లు.. కాలువలు కూడా మృగ్యమే. దీంతో ఇక్కడ అంతటి వర్షాభావ పరిస్థితుల్లో మనగలిగే పత్తి, మామిడి, పొద్దు తిరుగుడు వంటి పంటలను సాగు చేస్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు మారాయి. హార్టికల్చర్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ద్రాక్ష, యాపిల్ వంటి పళ్ళను సైతం పండేలా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.ఇందులో భాగంగా రైతులు, పరిశోధకులు ఏమాత్రం తక్కువ ఉష్ణోగ్రత ఉన్నా మనగలిగే యాపిల్ రకాలను అన్వేషిస్తున్నారు. ఇవి వేడి వాతావరణంలో కూడా పెరగగలవు. అయితే వీటికి సాగునీరు అందించాల్సి ఉంటుంది. దీంతోబాటు డ్రిప్ ద్వారా నీరు అందిస్తే యాపిల్ మరింత ఆరోగ్యకరంగా పెరుగుతుంది. ప్రయోగాత్మకంగా ఇక్కడ యాపిల్స్ పంట సక్సెస్ కావడంతో ఇక ఇక్కడ మున్ముందు మరింతగా దీని సాగు పెరుగుతుందని ఆశిస్తున్నారు. ఒక మొక్క అద్భుతంగా కాపునివ్వడంతో శాస్త్రవేత్తలు, రైతుల్లో సంతోషం మిన్నంటింది. మున్ముందు ఇక్కడ కూడా యాపిల్ సాగు సాధ్యమే అనే విశ్వాసం పెంపొందింది. దీంతో ఈ యాపిల్ సాగుపై అధికారులు, రైతుల్లో అసలు పెరిగి.. ఈ దిశగా కృషి మొదలైంది.విశాఖ మన్యంలోనూ యాపిల్ సాగు..అనంతపురంలోనే కాకుండా అల్లూరి జిల్లా చింతపల్లి జీకే వీధి మండలాల్లో యాపిల్ సాగు మంచి ఫలితాలను ఇస్తోంది. సముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తులో ఉండే చింతపల్లి జీకేవీధి, పాడేరు, అరకులోయల్లోని ఏజెన్సీ ప్రాంతాలు యాపిల్ సాగుకు అనువైన ప్రాంతంగా నిలుస్తున్నాయి. దీంతోబాటు ఆంధ్రప్రదేశ్ కాశ్మీరుగా చెప్పే లంబసింగిలో యాపిల్ సాగుకు అనుకూలం అని తేలింది. దీంతో ఐదేళ్ల క్రితం విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో యాపిల్ సాగు మొదలవగా నేడు అవి మంచి ఫలితాలను ఇస్తున్నది. ఇక రెండు వెరైటీల యాపిల్ చెట్లు ఇక్కడ పెరిగాయని సాగు చేసిన రైతులు చెబుతున్నారు. ఇక్కడ పండుతున్న ఒక్కో యాపిల్ బరువు 300 - 400 గ్రాములు ఉన్నట్లు తేలింది. విశాఖ ఏజెన్సీలోని దమనపల్లి పంచాయతీ కింద ఉన్న మడెం అనే గిరిజన గ్రామంలో యాపిల్ తోటను పెంచారు. ఒక్కో చెట్టుకు 30 నుంచి 34 యాపిల్ పండ్లు వచ్చాయి. కొన్నేళ్ల క్రితం పాడేరు ఐటీడీఏలో అధికారులు యాపిల్ మొక్కలను కొంతమంది రైతులకు అందజేసి యాపిల్ పెంపకాన్ని ప్రోత్సహించారు. ఇవి మంచి ఫలితాలను ఇచ్చినట్లు అక్కడి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యాపిల్ సాగు విశాఖ ఏజెన్సీలోని మండలాల్లో 60 నుంచి 70 ఎకరాల్లో సాగులో ఉంది. దీన్ని కనీసం 200 ఎకరాలకు విస్తరించాలన్నది అధికారుల ప్లాన్. మొత్తానికి ఏపీ ఇప్పుడు ఒక యాపిల్స్ అడ్డాగా మారింది.-సిమ్మాదిరప్పన్న -
ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి
మైదుకూరు టౌన్: రాయలసీమ ప్రాంతంలో రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలు చంద్రబాబుకు పట్టడం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి కనివిప్పు కలిగేలా ఈ నెల 29న సోమవారం రైతులతో కలిసి కడప కలెక్టరేట్ వద్ద మహధర్నా చేస్తున్నట్లు మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఎంపీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీశైలం జలాశయంలో 150టీఎంసీల నీరు నిల్వ ఉన్నప్పటికీ నీటిని కేసీ, తెలుగుగంగకు విడుదల చేయడంలో ప్రభత్వు వెనుకంజ వేస్తుందన్నారు. జిల్లాలో ఎక్కువ శాతం రైతులు కేసీ ఆయకట్టు కిందనే పంటను సాగుచేస్తున్నారని, నీరు ఉన్నా ఖరీఫ్ పంటకు పూర్తి స్థాయిలో అందిస్తారో లేదోనని రైతన్నలు భయపడుతున్నారు. జిల్లా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా జనవరి 15వ వరకు నీటిని అందిస్తామనే హమీని ఇవ్వాలన్నారు. చంద్రబాబు రాయలసీమ పట్ల కనీస చిత్తశుద్ది లేకకుండా వ్యవహరిస్తున్నారన్నాడు. తెలుగుగంగకు నీరు అందించాలని కర్నూలులో జరిగిన ఐడీబీ సమావేశంలో కూడా అధికారులను కోరామన్నారు. చంద్రబాబు జిల్లా పర్యటకు వచ్చినప్పుడల్లా తెలుగుగంగకు 12టీఎంసీల నీరు ఇస్తా, గండికోటకు నీరు అందిస్తామని చెప్పుతున్నాడే తప్ప అది సాధ్యం కావడం లేదన్నారు. వెలుగోడు నుంచి వచ్చే కాలువలు పూర్తిగా దెబ్బతినడంతో ప్రాజెక్టులకు నీరు రావడం లేదు.. మరి చంద్రబాబు నీరు ఇస్తానని చెప్పుతున్నాడే బిందెలతో తెచ్చిపాజెక్టులతో పోస్తాడా లేక ఆకాశం నుంచి డైరెక్టుగా ప్రాజెక్టులోకి నీరు ఇస్తాడో అనేది తమకు అర్థం కావడం లేదన్నారు. సోమవారం కడప కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాలో జిల్లాలోని ఆయకట్టు రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు.


