దళిత వ్యతిరేక ప్రభుత్వాలపై పోరాటం | The fight against anti -Dalit | Sakshi
Sakshi News home page

దళిత వ్యతిరేక ప్రభుత్వాలపై పోరాటం

Aug 30 2016 11:46 PM | Updated on Mar 28 2019 6:26 PM

మాట్లాడుతున్న స్కైలాబ్‌బాబు - Sakshi

మాట్లాడుతున్న స్కైలాబ్‌బాబు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని, ఈ ప్రభుత్వాలపై పోరాటం కొనసాగించాలని కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు పిలుపునిచ్చారు.

  • కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు
  • జిల్లాకు చేరిన  కేవీపీఎస్‌ బస్సుయాత్ర
  • కూసుమంచి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని, ఈ ప్రభుత్వాలపై పోరాటం కొనసాగించాలని కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు పిలుపునిచ్చారు. కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో ఈ నెల 23న సంగారెడ్డి నుంచి మొదలైన దళిత ఆత్మగౌరవ బస్సుయాత్ర మంగళవారం సాయంత్రం కూసుమంచికి చేరింది. యాత్ర బృందం సభ్యులు బస్టాండ్‌ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో స్కైలాబ్‌బాబు మాట్లాడారు. దళితులపై ఆరెస్సెస్, బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన దాడులకు పాల్పడుతున్నాయన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల మాట్లాడుతూ దళితులను కొట్టకండి అవసరమైతే తనను కా ల్పండి అంటూ మొసలికన్నీరు పెడుతూ మాట్లాడారని విమర్శించారు. రాష్ట్రంలోని కేసీఆర్‌ ప్రభుత్వం కూడా దళిత వ్యతిరేకమేనన్నారు. సీఎం కేసీఆర్‌ పిట్టల దొరకు మించిన ఘనుడన్నారు. సీఎం కూతురు కవిత, బంగారు తెలంగాణ  పేరుతో బతుకమ్మలాడుతూ అగ్రకులాల మహిళలతోనే పండుగ చేస్తున్నారని, దళితులను దూరంగా పెడుతున్నారని విమర్శించారు. అసలు దళితులు లేనిదే బతుకమ్మ ఎక్కడిది.. బతుకమ్మ ఎరవూ అంటూ ప్రశ్నించారు. 
    కార్యక్రమంలో  రాష్ట్ర ఉపాద్యక్షుడు కె.నర్సింహారావు, నాయకులు మామిడి సర్వయ్య, జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్, డివిజన్‌ కార్యదర్శి కొమ్ము శ్రీను, పగిడికత్తుల నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ ఎడవెల్లి ముత్తయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పొ¯ð ్నకంటి సంగయ్య, తాళ్లూరి వెంకటేశ్వరరావు, రైతు సంఘం డివిజన్‌ అద్యక్షుడు రేలా వెంకటరెడ్డి, నందిగామ కృష్ణ, గోపె వెంకన్న, నలగాటి మైసయ్య,  భూక్యా సంతూనాయక్, రజక సంఘం నాయకులు కొక్కిరేణి వెంకన్న, కొరట్ల పాపయ్య తదిరతులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement