కారు ఢీకొని మహిళ మృతి | The car hit the woman's death | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని మహిళ మృతి

Oct 13 2016 11:45 PM | Updated on Sep 4 2017 5:05 PM

కారు ఢీకొన్న సంఘటనలో మున్సిపాలిటీ పరిధిలోని ఉల్లిమెల్ల గ్రామానికి చెందిన తులశమ్మ (40) అనే మహిళ గురువారం మృతి చెందింది.

పులివెందుల: కారు ఢీకొన్న సంఘటనలో మున్సిపాలిటీ పరిధిలోని ఉల్లిమెల్ల గ్రామానికి చెందిన తులశమ్మ (40) అనే మహిళ గురువారం మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఉలిమెల్ల గ్రామానికి చెందిన తులశమ్మ ఆమె భర్త గంగన్న కూలి పనులకు వెళ్లి జీవనం కొనసాగించేవారు. ఈ క్రమంలో గురువారం కూలి పనుల కోసం తులశమ్మ ఉల్లిమెల్ల గ్రామం నుంచి పొలాల వైపునకు వెళ్లే రోడ్డు దాటుతుండగా.. వీరపునాయునిపల్లె నుంచి పులివెందులకు వస్తున్న కారు ఢీకొనడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement