డబ్బుతీసుకుని చంపేశారు | the boy's kidnap and murder in Guntur district | Sakshi
Sakshi News home page

డబ్బుతీసుకుని చంపేశారు

Apr 18 2016 2:06 PM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లా ఫిరంగి పురం మండలం తాళ్లూరులో సోమవారం దారుణం చోటు చేసుకుంది.

- గుంటూరు జిల్లాలో దారుణం
- బాలుడి కిడ్నాప్, హత్య
గుంటూరు

గుంటూరు జిల్లా ఫిరంగి పురం మండలం తాళ్లూరులో సోమవారం దారుణం చోటు చేసుకుంది. కిడ్నాప్ డబ్బు అందిన తర్వాత కూడా ఓ బాలుడిని కిరాతకంగా హతమార్చారు.


ఈనెల 14న తాళ్లూరుకి చెందిన యాదిత్య రాజు(8) అనే బాలుడిని కిడ్నాప్ చేశారు. అండల్ పేటలో బాలుడిని కిడ్నాప్ చేసిన దుండగులు.. అతని తల్లిదండ్రుల వద్ద రూ15 లక్షలు డిమాండ్  చేశారు. దీంతో వారు కిడ్నాపర్లకు రూ.12 లక్షలు అందించారు.


అయితే సోమవారం స్థానిక చెరువులో బాలుడి మృత దేహం వెలుగు చూసింది. కిడ్నాపర్లే డబ్బు తీసుకుని బాలుడిని హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement