వైఎస్సార్‌ సీపీ ఎదుగుదల చూడలేకే.. | TDP encourages faction politics, says gangula prabhakar reddy | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ ఎదుగుదల చూడలేకే..

May 21 2017 4:55 PM | Updated on Sep 5 2017 11:40 AM

పత్తికొండ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డిని పథకం ప్రకారమే హత్య చేశారని ఎమ్మెల్పీ గంగుల ప్రభాకర్‌ రెడ్డి ఆరోపించారు.

కర్నూలు: పత్తికొండ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డిని పథకం ప్రకారమే హత్య చేశారని ఎమ్మెల్పీ గంగుల ప్రభాకర్‌ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం అండతోనే టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. ఫ్యాక్షన్‌ రాజకీయాలను టీడీపీ ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు.

నారాయణ రెడ్డి మృతి చాలా దురదృష్టకరమని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎదుగుదల చూడలేకే టీడీపీ ఈ దారుణానికి ఒడిగట్టిందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో టీడీపీకి మనుగడ ఉండదన్న భయంతోనే దాడులకు పాల్పతున్నారని దుయ్యబట్టారు. పోలీసు వ్యవస్థను చంద్రబాబు నిర్వీరం చేసిందని వ్యాఖ్యానిం​చారు.

Advertisement
 
Advertisement
Advertisement