ఎమ్మెల్సీ గంగులను కలిసిన తారకరత్న | Hero Taraka Ratna Met YSRCP MLC Gangula Prabhakar Reddy | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ గంగులను కలిసిన నందమూరి తారకరత్న

Oct 11 2020 7:37 AM | Updated on Oct 11 2020 9:21 AM

Hero Taraka Ratna Met YSRCP MLC Gangula Prabhakar Reddy - Sakshi

ఎమ్మెల్సీ ప్రభాకర్‌తో మాట్లాడుతున్న సినీ హీరో తారకరత్న  

సాక్షి, ఆళ్లగడ్డ: సినీ హీరో నందమూరి తారకరత్న శనివారం ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. జమ్మలమడుగు మండలం గండికోటలో జరుగుతున్న చిత్రం షూటింగ్‌ నిమిత్తం వచ్చిన తారకరత్న తిరుగు ప్రయాణంలో వైఎస్సార్సీపీ నాయకుడు గిరిధర్‌రెడ్డితో కలసి హైదరాబాద్‌కు వెళ్తూ మార్గమధ్యలో ఎమ్మెల్సీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిని కలిశారు.  (కోనేటి ఆదిమూలంకు సీఎం జగన్‌ పరామర్శ)  

అహోబిలేశుడిని దర్శించుకున్న ఎమ్మెల్సీ దంపతులు 
ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో శ్రీలక్ష్మీనరసింహ స్వామిని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి దంపతులు శనివారం దర్శించుకున్నారు. ముందుగా మఠం మేనేజర్‌ వైకుంఠం, ప్రధాన అర్చకులు వేణుగోపాలన్‌ వారికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement