‘టాలెంట్‌ సెర్చ్‌’ విజేత అవినాష్‌ | talent search winner avinash | Sakshi
Sakshi News home page

‘టాలెంట్‌ సెర్చ్‌’ విజేత అవినాష్‌

Aug 1 2016 6:37 PM | Updated on Sep 4 2017 7:22 AM

‘టాలెంట్‌ సెర్చ్‌’ విజేత అవినాష్‌

‘టాలెంట్‌ సెర్చ్‌’ విజేత అవినాష్‌

నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామ్‌(ఎన్‌టీఎస్‌ఇ)లో పాపన్నపేట మండలం అర్కెల గ్రామానికి చెందిన చిట్యాల అవినాష్‌ ఎంపికయ్యాడు.

పాపన్నపేట: నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌(ఎన్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామ్‌(ఎన్‌టీఎస్‌ఇ)లో పాపన్నపేట మండలం అర్కెల గ్రామానికి చెందిన చిట్యాల అవినాష్‌ ఎంపికయ్యాడు. ఇతను హైదరాబాద్‌లోని శ్రీ చైతన్యలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు.

జాతీయ స్థాయిలో రెండు దశల్లో జరిగిన ఈ పరీక్షలో తెలంగాణ నుంచి మొత్తం 24 మంది ఎంపిక కాగా అందులో అవినాష్‌ ఒకరు. పీజీ పూర్తి అయ్యే వరకు అవినాష్‌కు స్కాలర్‌షిప్‌ వస్తుందని, అదేవిధంగా ట్రిపుల్‌ ఐటీలో డైరెక్టుగా అడ్మిషన్‌ లభిస్తుందని అతని తల్లిదండ్రులు అమృతరావు, వినోద తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement