యాదాద్రిలో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో | T congress leaders protests at yadagirigutta | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో

Jun 25 2016 11:04 AM | Updated on Sep 22 2018 7:53 PM

పెంచిన విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు వెంటనే ఉపసంహరించాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

నల్గొండ: పెంచిన విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు వెంటనే ఉపసంహరించాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అందులోభాగంగా శనివారం నల్గొండ జిల్లా యాదాద్రిలోని ప్రముఖ శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయం వద్ద ప్రభుత్వ తీరుకు నిరససగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు.

వైకుంఠ ద్వారానికి వెళ్లే దారిలో నాయకులు బైఠాయించారు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాంతో ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి... ధర్నాకు దిగన కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement