వచ్చే నెల ఒకటో తేదీ నాటికి అన్ని మెడికల్ షాపుల్లో స్వైప్ మిషన్(ఈ - పాస్)లను తప్పనిసరి చేస్తూ ఔషధ నియంత్రణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఒ.కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
మెడికల్ షాపుల్లో స్వైప్ మిషన్లు
Nov 23 2016 12:28 AM | Updated on Jul 18 2019 1:50 PM
- ఒకటి నుంచి అమలు
కర్నూలు(హాస్పిటల్): వచ్చే నెల ఒకటో తేదీ నాటికి అన్ని మెడికల్ షాపుల్లో స్వైప్ మిషన్(ఈ - పాస్)లను తప్పనిసరి చేస్తూ ఔషధ నియంత్రణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఒ.కుమార్ ఆదేశాలు జారీ చేశారు. స్థానిక కెమిస్ట్ భవన్‌లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన బ్యాంకు అధికారులు, కెమిస్ట్‌ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజల వద్ద ప్రస్తుతం కేవలం 10 శాతం మాత్రమే నగదు ఉందన్నారు. ఈ కారణంగా మెడికల్‌షాపు నిర్వాహకులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లాలో 2వేలకు పైగా హోల్‌సేల్, రిటైల్ కెమిస్ట్‌లున్నారని, వీరందరూ తప్పనిసరిగా స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాల్సిందేనన్నారు. మిషన్లు ఏర్పాటు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు అబిద్ అలి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Advertisement


