గద్వాల న్యూటౌన్ : షాద్‌నగర్‌లో ఈ నెల 4న జరిగే స్వేరోయిజం సమావేశానికి తరలిరావాలని స్వేరోస్ కమిటీ డివిజన్ అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్ అన్నారు.
4న స్వేరోయిజం సమావేశం
Sep 2 2016 12:09 AM | Updated on Sep 4 2017 11:52 AM
గద్వాల న్యూటౌన్ : షాద్‌నగర్‌లో ఈ నెల 4న జరిగే స్వేరోయిజం సమావేశానికి తరలిరావాలని స్వేరోస్ కమిటీ డివిజన్ అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని రామిరెడ్డి స్మారక గ్రంథాలయంలో స్వేరోస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమావేశానికి విశిష్ట అతిథిగా తెలంగాణ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్ రాంకిషన్, జెడ్పీ సీఈఓ లక్షీ్మనారాయణ, షాద్‌నగర్ ఏఎస్పీ కల్మేశ్వర్ సింగెనవార్‌తోపాటు వక్తలుగా ప్రొఫెసర్లు హాజరవుతారన్నారు. సమావేశంలో కమిటీ సభ్యు లు దిలీప్‌కుమార్, రాజు, రాబర్ట్, సురేష్, శ్రావన్, నాగన్న, విజయ్ పాల్గొన్నారు.
Advertisement


