బాబా చిత్ర పటాలు పూజ గదిలో ఉంచుకోవద్దు | Swaroopanand Saraswati comments on Shirdi Sai Baba | Sakshi
Sakshi News home page

బాబా చిత్ర పటాలు పూజ గదిలో ఉంచుకోవద్దు

Oct 16 2016 8:22 AM | Updated on Sep 4 2017 5:19 PM

బాబా చిత్ర పటాలు పూజ గదిలో ఉంచుకోవద్దు

బాబా చిత్ర పటాలు పూజ గదిలో ఉంచుకోవద్దు

షిరిడీ సాయిబాబా ఓ ముస్లిం తెగకు చెందినవారు. ఆయన్ను వ్యక్తిగతంగా ఆరాధిస్తూ చాలా మంది హిందువులు తప్పు చేస్తున్నారు.

స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యలు
 
అనంతపురం కల్చరల్: ‘షిరిడీ సాయిబాబా ఓ ముస్లిం తెగకు చెందినవారు. ఆయన్ను వ్యక్తిగతంగా ఆరాధిస్తూ చాలా మంది హిందువులు తప్పు చేస్తున్నారు. ఆయన చిత్రపటాలను పూజ గదిలో ఉంచుకోవద్ద’ని ద్వారకా శారద పీఠం అధిపతి శంకరాచార్య స్వరూపానంద సరస్వతి సూచించారు. శనివారం అనంతపుర వచ్చిన ఆయన భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు.

ఈ సందర్భంగా షిరిడీ సాయిని ఆరాధించడాన్ని వ్యతిరేకించడంతో పాటు ఆయన్ను పూజించబోమని, హిందూ ధర్మంతోనే ఉంటామని భక్తులతో ప్రమాణం చేయించారు. దీన్ని బాబా భక్తులు వ్యతిరేకించడంతో వివాదానికి దారితీసింది. దీంతో పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు.

Advertisement
 
Advertisement
Advertisement