పెళ్లి రోజే వధువు ఆత్మహత్యాయత్నం | suscide atemt to a women on marriege day | Sakshi
Sakshi News home page

పెళ్లి రోజే వధువు ఆత్మహత్యాయత్నం

Sep 23 2016 12:01 AM | Updated on Sep 4 2017 2:32 PM

పెళ్లి రోజే వధువు ఆత్మహత్యాయత్నం

పెళ్లి రోజే వధువు ఆత్మహత్యాయత్నం

ప్రేమించి పెళ్లి చేసుకుని 24గంటలు గడవక ముందే నవ వధువు క్వారీ బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన పాల్వంచ మండలం తోగ్గూడెంలో గురువారం చోటుచేసుకుంది.

తోగ్గూడెం(పాల్వంచరూరల్‌) :  ప్రేమించి పెళ్లి చేసుకుని 24గంటలు గడవక ముందే నవ వధువు క్వారీ బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన  పాల్వంచ మండలం తోగ్గూడెంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండల పరిధిలోని తోగ్గూడెంలో ఉన్న క్వారీ క్యాంప్‌లో నివాసం ఉంటున్న ఒడిశాకు చెందిన  మంజుల, లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ప్రశాంత్‌ ప్రేమించుకున్నారు. పెద్దమ్మతల్లి గుడి వద్ద గురువారం ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఇంటికి వెళ్లిన తర్వాత ప్రశాంత్‌ కుటుంబీకులు వారి వివాహాన్ని అంగీకరించలేదు. దీంతో గురువారం సాయంత్రం మంజుల గ్రామ సమీపంలోని క్వారీ బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అటుగా వెళ్తున్న క్వారీ కార్మికులు గమనించి నీటిలో నుంచి బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స జరిపించారు. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు  మంజుల భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ .బి.సత్యనారాయణ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement