భూగర్భ జలవనరుల సర్వేను పూర్తి చేయాలి | Survey on under ground water resources | Sakshi
Sakshi News home page

భూగర్భ జలవనరుల సర్వేను పూర్తి చేయాలి

Sep 11 2016 12:48 AM | Updated on Sep 29 2018 6:11 PM

భూగర్భ జలవనరుల సర్వేను పూర్తి చేయాలి - Sakshi

భూగర్భ జలవనరుల సర్వేను పూర్తి చేయాలి

నెల్లూరు(అర్బన్‌): ఎన్టీఆర్‌ జలసిరి పథకం కింద బోర్ల మంజూరుకు భూగర్భ జలవనరుల సర్వేను వెంటనే పూర్తి చేయాలని డ్వామా పీడీ హరిత జియాలజిస్టులకు సూచించారు

 
  • డ్వామా పీడీ హరిత
నెల్లూరు(అర్బన్‌): ఎన్టీఆర్‌ జలసిరి పథకం కింద బోర్ల మంజూరుకు భూగర్భ జలవనరుల సర్వేను వెంటనే పూర్తి చేయాలని డ్వామా పీడీ హరిత జియాలజిస్టులకు సూచించారు. శనివారం ఆమె దర్గామిట్టలోని తన చాంబర్‌లో జియాలజిస్టులు, కార్యాలయ సిబ్బందితో ఎన్టీర్‌ జలసరి పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్‌ జలసిరి కింద జిల్లాకు 15,249 బోర్లు మంజూరయ్యాయని తెలిపారు. 2016లో 5వేల బోర్లను వేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎంపీడీఓ, ఉపాధి హామీ పథకం సిబ్బంది సమన్వయంతో చిన్న, సన్నకారు రైతులను గుర్తించాలని కోరారు. భూగర్భ జల వనరుల శాఖ ఉపసంచాలకులు రమేష్‌ మాట్లాడుతూ భూగర్భజల వనరుల సర్వే నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డ్వామా అడిషనల్‌ పీడీ ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement