సర్వర్‌ డౌన్‌ | surver down in revenue department transfer | Sakshi
Sakshi News home page

సర్వర్‌ డౌన్‌

May 11 2017 10:35 PM | Updated on Sep 5 2017 10:56 AM

రెవెన్యూ శాఖలో బదిలీల ప్రక్రియలో భాగంగా ఆప్షన్ల అప్‌లోడ్‌కు బ్రేక్‌ పడింది. బుధవారం చివరి గడువు కాగా ఆ రోజు సర్వర్‌ డౌన్‌ కావడంతో దాదాపు 40 మంది రెవెన్యూ ఉద్యోగులు ఆప్షన్లను ఇచ్చుకోలేకపోయారు.

- బదిలీ ఆప్షన్‌ ఇవ్వలేక పోయిన ఉద్యోగులు
–  10వ తేదీతో ముగిసిన గడువు


అనంతపురం అర్బన్‌ : రెవెన్యూ శాఖలో బదిలీల ప్రక్రియలో భాగంగా ఆప్షన్ల  అప్‌లోడ్‌కు బ్రేక్‌ పడింది. బుధవారం చివరి గడువు కాగా  ఆ రోజు  సర్వర్‌ డౌన్‌ కావడంతో దాదాపు 40 మంది రెవెన్యూ ఉద్యోగులు ఆప్షన్లను ఇచ్చుకోలేకపోయారు. రెవెన్యూ శాఖలో అన్ని కేటగిరీల్లో దాదాపు 80 మంది బదిలీలకు అర్హత కలిగి ఉన్నారు.  సీనియార్టీ జాబితా సిద్ధం చేసినప్పటికీ ప్రభుత్వం మార్గదర్శాలు జారీలో జాప్యం జరిగి ఈ నెల 7న విడుదల చేసింది.  దీంతో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు మూడు రోజుల గడువు ఉండడంతో  అన్ని శాఖల ఉద్యోగులు  అప్‌లోడ్‌ చేసే ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో  చివరి రోజు సర్వర్‌పై ఒత్తిడి పెరగడంతో అది మొరాయించింది. దీంతో అనేక మంది అప్‌లోడ్‌ చేసుకోలేక తీవ్ర నిరాశకు గురయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement