సమాజంలోని ప్రతి ఒక్కరూ కాలుష్య నియంత్రణకు సహకరించాలని కళాజాతా బృందాల కోఆర్డినేటర్ వై.మురళీకృష్ణ పిలుపునిచ్చారు.
కాలుష్య నియంత్రణకు సహకరించాలి
Nov 28 2016 12:21 AM | Updated on Oct 20 2018 4:36 PM
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : సమాజంలోని ప్రతి ఒక్కరూ కాలుష్య నియంత్రణకు సహకరించాలని కళాజాతా బృందాల కోఆర్డినేటర్ వై.మురళీకృష్ణ పిలుపునిచ్చారు. డిసెంబర్ 2వ తేదీన నిర్వహించనున్న కాలుష్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని రూరల్ అవెర్‌నెస్ ఫోకాట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణపై కళాజాతా బృందాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం కర్నూలు పట్టణంలోని చెన్నమ్మ సర్కిల్, ఆర్‌టీసీ బస్టాండ్, పాతబస్టాండ్ తదితర ప్రాంతాల్లో కళాజాతా బృందం పాటలు, కథలు ద్వారా కాలుష్య నియంత్రణ ప్రాధాన్యతను వివరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకూడదని, మొక్కలను పెంచాలని కోరారు. కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు వై.రమణ, ఎం.విజయకుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement