అక్కడ రాళ్లే నైవేద్యం | summer special of bhairaveswara swamy | Sakshi
Sakshi News home page

అక్కడ రాళ్లే నైవేద్యం

Jun 4 2017 11:35 PM | Updated on Sep 5 2017 12:49 PM

అక్కడ రాళ్లే నైవేద్యం

అక్కడ రాళ్లే నైవేద్యం

లేపాక్షి మండలంలోని కోడిపల్లి నుంచి హిందూపురానికి వెళ్లే రహదారిలో ఒక కిలోమీటర్‌ దూరం ప్రయాణిస్తే కొత్తపల్లిక్రాస్‌ వద్ద ఉన్న బట్ల బైరవేశ్వర స్వామికి రాళ్లను నైవేద్యంగా సమర్పిస్తుంటారు.

లేపాక్షి మండలంలోని కోడిపల్లి నుంచి హిందూపురానికి వెళ్లే రహదారిలో ఒక కిలోమీటర్‌ దూరం ప్రయాణిస్తే కొత్తపల్లిక్రాస్‌ వద్ద ఉన్న బట్ల బైరవేశ్వర స్వామికి రాళ్లను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈ దేవుడికి జంతుబలులు, అభిషేకాలు, అర్చనలు అంటూ ప్రత్యేకించి ఏవీ ఉండవు. ఆ దారి గుండా ప్రయాణించే వారు మూడు రాళ్లను నైవేద్యంగా సమర్పించి వెళుతుంటారు. ఇలా చేయడం వల్ల తమ కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇలా భక్తులు సమర్పించిన రాళ్లు ఓ గుట్టగా పోగయ్యాయి. అయితే దీనికి ఓ ప్రాచీన కథను స్థానికులు నేటికీ వినిపిస్తున్నారు.

అదేమంటే పూర్వం తిరుపతికి పాదయాత్రగా కుటుంబసభ్యులతో బయలుదేరిన బైరవేశ్వరుడనే భక్తుడు.. ఈ ప్రాంతానికి చేరుకునే సమయానికి చీకటి పడింది. దీంతో ఆ రాత్రికి అక్కడే విడిది చేశారు. తెల్లవారే సరికి భైరవేశ్వరుడు చనిపోయినట్లు గుర్తించి, అక్కడే ఖననం చేశారు. ఆ సమయంలో అతని సమాధిపై ఒక్కొక్కరు మూడు రాళ్లు వేసి వెళ్లారు. మనసులో ఏదైనా కోరుకుని ఇక్కడ మూడు రాళ్లు వేస్తే అవి నెరవేరుతూ వస్తుండడంతో ఆ మరుసటి రోజున కోడి పుంజులను ఇక్కడ బలివ్వడం మొదలు పెట్టినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
- లేపాక్షి (హిందూపురం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement