రాజేంద్రనగర్ మండలం నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సూపర్ మార్కెట్ ముందు సూట్‌కేస్ కలకలం సృష్టించింది.
రాజేంద్రనగర్ మండలం నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సూపర్ మార్కెట్ ముందు సూట్‌కేస్ కలకలం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తులు సూట్‌కేస్‌ను సూపర్ మార్కెట్ ముందు వదిలి వెళ్లారు. ఇది గమనించిన స్తానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు బాంబ్స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ముమ్మర తనిఖీలు నిర్వహించారు. కలకలానికి కారణం అయిన సూట్ కేస్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.