ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు | Bomb Threat At Delhi High Court, Judges Of Several Benches Temporarily Suspended Court Proceedings | Sakshi
Sakshi News home page

ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు

Sep 12 2025 1:00 PM | Updated on Sep 12 2025 1:37 PM

Bomb Threat At Delhi High Court

ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో పలు బెంచ్‌ల న్యాయమూర్తులు.. కోర్టు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేశారు. హైకోర్టు ప్రాంగణం ఖాళీ చేయాలని న్యాయవాదులకు భద్రతా సిబ్బంది సూచించారు. బెదిరింపు మెయిల్‌తో బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టింది. హైకోర్టు ఆవరణలో మూడు ప్రదేశాల్లో ఆర్డీఎక్స్‌ అమర్చామని.. పాక్‌తో ఐసిస్‌తో సంబంధాలున్నట్లు మెయిల్‌లో ప్రస్తావించారు.

గత నెలలో కూడా పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు ఫోన్‌కాల్స్‌, మెయిల్స్‌ రావడంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టిన సంగతివ తెలిసిందే. ఈమెయిల్స్‌ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ ఫోరెన్సిక్ దర్యాప్తు చేపడుతున్నారు. ఈ క్రమంలో.. అంతర్జాతీయ IP అడ్రస్‌లు, వర్చువల్ ప్రాక్సీలు వాడుతున్నట్లు గుర్తించారు. స్కూల్స్‌, కోర్టులు, గవర్నమెంట్‌ ఆఫీసులు, బహిరంగ ప్రాంతాలు, ఆఖరికి విమానాల్లోనూ బాంబు ఉందంటూ బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement