సబ్‌ ట్రెజరీ నిధుల గోల్‌మాల్‌ | sub treasury investigation | Sakshi
Sakshi News home page

సబ్‌ ట్రెజరీ నిధుల గోల్‌మాల్‌

Jul 31 2016 8:41 PM | Updated on Sep 4 2017 7:13 AM

జూన్‌ 29వ తేదీన ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సురేంద్రబాబు ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసి దర్యాప్తు చేసిన వన్‌ టౌన్‌ పోలీసులు జులై 21వ తేదీన వరుణ్‌బాబును అరెస్ట్‌ చేశారు.

 కేసులో దర్యాప్తు ముమ్మరం
 
తెనాలి రూరల్‌: తెనాలి సబ్‌ట్రెజరీ నిధుల గోల్‌మాల్‌ వ్యవహారానికి సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రూ. 1.10 ఓట్ల నిధులను సబ్‌ ట్రెజరీ జూనియర్‌ అకౌంటెంట్‌ తాడికొండ వరుణ్‌బాబు తన బ్యాంకు ఖాతాతో పాటు తనకు తమ్ముడు వరుసయ్యే రాజ్‌కుమార్‌ దత్తు ఖాతాల్లోకి మళ్లించిన సంగతి తెలిసిందే. జూన్‌ 29వ తేదీన ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సురేంద్రబాబు ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసి దర్యాప్తు చేసిన వన్‌ టౌన్‌ పోలీసులు జులై 21వ తేదీన వరుణ్‌బాబును అరెస్ట్‌ చేశారు. అప్పటికి కేవలం రూ. తొమ్మిది లక్షలను మాత్రమే పోలీసులు రికవరీ చేయగలిగారు. దీంతో మూడు రోజుల క్రితం అతన్ని పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. డీఎస్పీ జీవీ రమణమూర్తి నేతృత్వంలో మూడు రోజుల పాటు వరుణ్‌బాబును విచారించారు. స్వాహా చేసిన నిధులను రికవరీ చేసేందుకు నిందితుడితో పాటు   రాజ్‌కుమార్‌ దత్తు, ఇతర స్నేహితులను విచారించినట్టు తెలిసంది. అంతే కాక వరుణ్‌బాబు కొనుగోలు చేసిన కార్లు, మోటారు సైకిళ్లను సైతం రికవరీ‡ చేసే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నట్టు సమాచారం. కాగా కస్టడీ ముగియడంతో సోమవారం అతన్ని కోర్టులో హాజరుపరచనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement