breaking news
sub treasury
-
ఉన్నతాధికారుల వేధింపులతో అజ్ఞాతంలోకి ..
– శ్రీశైలం ఎస్టిఓ నాగసవిత శ్రీశైలం ప్రాజెక్ట్: ఉన్నతాధికారులు వేధిస్తుండడం వల్లే తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు శ్రీశైలం సబ్‌ట్రెజరీ అధికారిణి నాగ విజయ సవిత బుధవారం విలేకరులకు తెలిపారు. ఈ నెల 1వ తేదీన విధులకు హాజరై మధ్యాహ్నం నుంచి అదృశ్యం అయిన ఎస్టిఓ సవిత.. బుధవారం సున్నిపెంటలోని పోలీస్ ఔట్ పోస్ట్‌లో ప్రత్యక్షమయ్యారు. అక్రమ పద్ధతిలో ట్రెజరీ బిల్లులను చెయ్యమని ఉన్నతాధికారులు వేధిస్తున్నారని..వారి మాట వినకపోవడంతో ఎటువంటి సోకాజ్ నోటీసులు జారీ చేయకుండా చార్జ్ మెమోలు ఇచ్చారని ఆమె విలేకరులకు తెలిపారు. మానసికంగా కుంగిపోయిన తాను.. వరంగల్‌లోని తన పినతల్లి వద్దకు వెళ్లాలని చెప్పారు. తనను మానసికంగా వేధిస్తున్న పలువురిపై టుటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు. -
సబ్ ట్రెజరీ నిధుల గోల్మాల్
కేసులో దర్యాప్తు ముమ్మరం తెనాలి రూరల్: తెనాలి సబ్‌ట్రెజరీ నిధుల గోల్మాల్ వ్యవహారానికి సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రూ. 1.10 ఓట్ల నిధులను సబ్ ట్రెజరీ జూనియర్ అకౌంటెంట్ తాడికొండ వరుణ్‌బాబు తన బ్యాంకు ఖాతాతో పాటు తనకు తమ్ముడు వరుసయ్యే రాజ్‌కుమార్ దత్తు ఖాతాల్లోకి మళ్లించిన సంగతి తెలిసిందే. జూన్ 29వ తేదీన ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ సురేంద్రబాబు ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసి దర్యాప్తు చేసిన వన్ టౌన్ పోలీసులు జులై 21వ తేదీన వరుణ్‌బాబును అరెస్ట్ చేశారు. అప్పటికి కేవలం రూ. తొమ్మిది లక్షలను మాత్రమే పోలీసులు రికవరీ చేయగలిగారు. దీంతో మూడు రోజుల క్రితం అతన్ని పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. డీఎస్పీ జీవీ రమణమూర్తి నేతృత్వంలో మూడు రోజుల పాటు వరుణ్‌బాబును విచారించారు. స్వాహా చేసిన నిధులను రికవరీ చేసేందుకు నిందితుడితో పాటు రాజ్‌కుమార్ దత్తు, ఇతర స్నేహితులను విచారించినట్టు తెలిసంది. అంతే కాక వరుణ్‌బాబు కొనుగోలు చేసిన కార్లు, మోటారు సైకిళ్లను సైతం రికవరీ‡ చేసే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నట్టు సమాచారం. కాగా కస్టడీ ముగియడంతో సోమవారం అతన్ని కోర్టులో హాజరుపరచనున్నారు.