అంతర్జాతీయ పోటీలు నిర్వహిస్తాం | sub junior football tourny starts today | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ పోటీలు నిర్వహిస్తాం

Sep 2 2017 10:32 PM | Updated on Oct 2 2018 8:39 PM

అంతర్జాతీయ పోటీలు నిర్వహిస్తాం - Sakshi

అంతర్జాతీయ పోటీలు నిర్వహిస్తాం

రానున్న కాలంలో రాష్ట్రంలో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ పోటీలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గోపాలకృష్ణ తెలిపారు.

- ఏపీ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గోపాలకృష్ణ
- అనంతలో నేటి నుంచి సబ్‌-జూనియర్‌ టోర్నీ ప్రారంభం


అనంతపురం సప్తగిరిసర్కిల్‌: రానున్న కాలంలో రాష్ట్రంలో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ పోటీలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గోపాలకృష్ణ తెలిపారు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే సబ్‌–జూనియర్‌ ఫుట్‌బాల్‌ క్రీడా పోటీల నిర్వహణపై శనివారం స్థానిక అనంత క్రీడా గ్రామంలోని ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్‌ ప్రోత్సాహంతోనే నేడు ఇంత పెద్ద టోర్నీ నిర్వహిస్తున్నామన్నారు. ఏషియన్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్, ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అందించిన సూచనలను ప్రణాళిక బద్ధంగా రూపొందించి టోర్నీ విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామన్నారు.

టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొనగా ఆదివారం జరిగే మొదటి మ్యాచ్‌లో తమిళనాడు–తెలంగాణ జట్లు తలపడతాయి. 6న ఆంధ్ర–పాండిచ్చేరి జట్ల మధ్య మొదటి మ్యాచ్‌ సాగుతుంది. టోర్నీ నుంచి రెండు జట్లు జాతీయస్థాయి టోర్నీకి అర్హత సాధిస్తాయి. చివరి లీగ్‌ మ్యాచ్‌ 8న ఆంధ్ర–కేరళ జట్ల మధ్య మ్యాచ్‌ ఉంటుంది. కాగా పోటీలను జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంచో ఫెర్రర్‌ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభిస్తారు. జాతీయస్థాయి టోర్నీలో తలపడే ఆంధ్ర జట్టుకు అనంత ఆర్డీటీ ఫుట్‌బాల్‌ అకాడమీకి చెందిన దాదాఖలందర్, మనురావు కోచ్‌లుగా ఎంపికయ్యారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

ఆంధ్ర జట్టు
మహబూబ్‌బాషా, దిలీప్‌రెడ్డి, మధుబాబు, శ్రీహరి, సుహేల్‌ (అనంతపురం), లక్ష్మణ్‌బోహర, నిశ్చయ్‌ఆనంద్, శివశంకర్, రాజు, ధ్రువ్‌ (విశాఖపట్టణం), దీపక్‌చందు, ప్రిన్స్‌కంగ్‌జాం (కృష్ణా), ప్రకాష్, షేక్‌ అల్తాఫ్‌ (నెల్లూరు), మోహన్‌ (కర్నూలు), పూజిత్, బన్ని (కడప), జోయెల్‌ఫిలిప్‌ (ప్రకాశం), జాకోబ్‌ హెరాల్డ్‌ హర్షిత్‌ (చిత్తూరు), భరత్‌ (విజయనగరం).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement