టీచర్ తిట్టాడని విద్యార్థి ఆత్మహత్యాయత్నం | student to commit suicide | Sakshi
Sakshi News home page

టీచర్ తిట్టాడని విద్యార్థి ఆత్మహత్యాయత్నం

Aug 3 2016 7:23 PM | Updated on Nov 9 2018 5:02 PM

పాఠశాలకు ఆలస్యంగా ఎందుకు వచ్చావని ఉపాధ్యాయుడు మందలించడంతో.. మనస్తాపానికి గురైన తొమ్మిదో తరగతి విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

పాఠశాలకు ఆలస్యంగా ఎందుకు వచ్చావని ఉపాధ్యాయుడు మందలించడంతో.. మనస్తాపానికి గురైన తొమ్మిదో తరగతి విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మోత్కూరులో బుధవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఒర్సు ఉపేందర్(14) లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

 

ఈక్రమంలో ఈ రోజు పాఠశాలకు ఆలస్యంగా వెళ్లడంతో.. ఉపాధ్యాయుడు మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఉపేందర్ పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఉపాధ్యాయుడు మందలించడం వల్లే పురుగుల మందు తాగాడని ఆగ్రహించిన బంధువులు, స్థానికులు పాఠశాల ఎదుట ఆందోళన చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement