మండల కేంద్రానికి చెందిన ఏడోతరగతి విద్యార్థిని పుష్ప (12) సోమవారం విషజ్వరంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వైద్యసిబ్బంది తెలిపారు.
కుందుర్పి: మండల కేంద్రానికి చెందిన ఏడోతరగతి విద్యార్థిని పుష్ప (12) సోమవారం విషజ్వరంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వైద్యసిబ్బంది తెలిపారు. నెలరోజులుగా జ్వరంతో బాధపడుతున్న పుష్పకు అనంతపురం, బెంగళూరు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించామని, పరిస్థితి విషమించి సోమవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు తెలిపారు.