లింగాల : సార్వత్రిక సమ్మెలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలో విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, గ్రామపంచాయతీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు.
లింగాల : సార్వత్రిక సమ్మెలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలో విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, గ్రామపంచాయతీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాతబస్టాండు వద్ద నిర్వహించిన సమావేశంలో సీపీఐ జిల్లా సమితి సభ్యుడు చెన్నదాస్, సీఐటీయూ మండల కార్యదర్శి రఘుపతిరాథోడ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలన్నారు. కార్మిక హక్కు చట్టాలను అమలు చేసి పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పల్లె నిరంజన్, డీసీసీ ఉపాధ్యక్షుడు కె.టి.తిరుపతయ్య, అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు పార్వతమ్మ, ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య, నియోజకవర్గ అధ్యక్షుడు పర్వతాలు, సీపీఐ మండల కార్యదర్శి ఎన్.శ్రీనివాసులు, చెంచు లోకం రాష్ట్ర అధ్యక్షుడు కాట్రాజు శ్రీనివాసులు, టీడీపీ నాయకుడు నీలకంఠం తదితరులు పాల్గొన్నారు.