ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామస్తులు కలిసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసుకోవాలని ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు.
ఇంద్రపాలనగరం(రామన్నపేట)
ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామస్తులు కలిసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసుకోవాలని ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు. మంగళవారం మండలంలోని ఇంద్రపాలనగరంలో సర్పంచ్ పూస బాలనర్సింహ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. అంగన్‌వాడీలకు వచ్చే పిల్లలకు నర్సరీ, ఎల్‌కేజీ విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతీగ్రామస్థాయి ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే వ్యవస్థ బాగుపడుతుందని వివరించారు. సమావేశంలో గ్రామసర్పంచ్ పూస బాలనర్సింహ, ఉపసర్పంచ్ గర్దాసు వెంకటేశం, తహసిల్దార్ ఎ.ప్రమోదిని, ఎంపీడీఓ కె.జానకిరెడ్డి, ఈఓపీఆర్డీ పి.శ్రీరాములు, పశువైద్యాధికారి ఎం.శ్రీధర్‌రెడ్డి, ప్రధానోపాద్యాయుడు తవుటం భిక్షపతి, పూస బాలకిషన్,వార్డుసభ్యులు అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.