నేడు రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు ప్రారంభం | state wide hocky tournament starts today | Sakshi
Sakshi News home page

నేడు రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు ప్రారంభం

Oct 13 2016 11:52 PM | Updated on Sep 4 2017 5:05 PM

జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అండర్‌ 14 బాల బాలికల రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు నగర శివారులోని ఇండస్‌ స్కూల్‌ ఆవరణలో ప్రారంభమవుతున్నాయని ఫెడరేషన్‌ కార్యదర్శి పవన్‌కుమార్‌ గురువారం తెలిపారు.

కల్లూరు : జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అండర్‌ 14 బాల బాలికల రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు నగర శివారులోని ఇండస్‌ స్కూల్‌ ఆవరణలో ప్రారంభమవుతున్నాయని ఫెడరేషన్‌ కార్యదర్శి పవన్‌కుమార్‌ గురువారం తెలిపారు. డీఈఓ రవీంద్రనాథ్‌ రెడ్డి శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. జట్టు క్రీడాకారులను అభినందించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాల క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. అనంతరం క్రీడాకారులకు స్పోర్ట్స్‌ కిట్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ ప్రతినిధి నరసయ్య, సంఘం కార్యదర్శి సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement