రైల్వే కోర్టుకు స్పీకర్‌ | Speaker of the railway court | Sakshi
Sakshi News home page

రైల్వే కోర్టుకు స్పీకర్‌

Jul 27 2016 11:20 PM | Updated on Aug 20 2018 6:47 PM

తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2013లో వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలం ధర్మారం రైల్వే గేట్‌ రైల్‌రోకోలో పాల్గొన్న ప్రస్తుత స్సీకర్‌ మధుసూదనాచారితో పాటు మరో 8 మందిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. రైల్‌రోకో కేసు

కాజీపేట రూరల్‌ : తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2013లో వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలం ధర్మారం రైల్వే గేట్‌ రైల్‌రోకోలో పాల్గొన్న ప్రస్తుత స్సీకర్‌ మధుసూదనాచారితో పాటు మరో 8 మందిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. వారు  బుధవారం కాజీపేట రైల్వే కోర్టు మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరయ్యారు. కేసును మెజిస్ట్రేట్‌ ఆగస్టు 22వ తేదీకి కేసు వాయిదా వేసినట్టు రైల్వే పోలీసులు తెలిపారు.
 
స్పీకర్‌ మధుసూదనాచారితో పాటు వీరాటి లింగారెడ్డి, గంగుల రమేష్, ప్రభాకర్, రాంమూర్తి, రామారావు, ల్యాదెళ్ల బాలు, గాదె రాజు, సందీప్‌లు ఈ కేసులో ఉన్నారు. అనంతరం స్పీకర్‌ మాట్లాడుతూ ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేతకు ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసిందని, మొక్కవోని ధైర్యంతో తెలంగాణ వాదులు వాటిని ఎదుర్కొన్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాట్లాyì  తెలంగాణవాదులపై పెట్టిన రైల్వే కేసులను కొట్టివేతకు కృషి చేస్తుందన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement