ఆత్మరక్షణ కోసమే కాల్పులు: రమా రాజేశ్వరి | SP Rama rajeswari reacts suspected militant nayeem killed in encounter | Sakshi
Sakshi News home page

ఆత్మరక్షణ కోసమే కాల్పులు: రమా రాజేశ్వరి

Aug 8 2016 1:20 PM | Updated on Oct 16 2018 9:08 PM

ఆత్మరక్షణ కోసమే కాల్పులు: రమా రాజేశ్వరి - Sakshi

ఆత్మరక్షణ కోసమే కాల్పులు: రమా రాజేశ్వరి

షాద్ నగర్ కాల్పులపై ఎస్పీ రమా రాజేశ్వరి స్పందించారు. గ్యాంగ్ స్టర్ నయీం హతమైన సంఘటనా స్థలాన్ని ఎస్పీ సోమవారం పరిశీలించారు.

మహబూబ్నగర్ : షాద్ నగర్ కాల్పులపై ఎస్పీ రమా రాజేశ్వరి స్పందించారు. గ్యాంగ్ స్టర్ నయీం హతమైన సంఘటనా స్థలాన్ని ఎస్పీ సోమవారం పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ నిన్న రాత్రి  వైట్ కలర్ ఫోర్డ్ ఎండీవర్ వాహనం అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సమాచారం వచ్చిందని, స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని, ఎండీవర్ను వెంబడించారన్నారు.
 
అయితే కారులోని వ్యక్తులు పోలీసులపై కాల్పులు జరిపారని, ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించినట్లు ఎస్పీ రమా రాజేశ్వరి తెలిపారు. చనిపోయిన వ్యక్తి నయీంగా భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. నయీంకు ఎన్నో కేసుల్లో ప్రమేయం ఉందని, చాలాకాలంగా అతడు తప్పించుకుని తిరుగుతున్నాడని, నయీం ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మరోవైపు నయీం భార్య, కుటుంబసభ్యులు ఉన్నట్లు అనుమానంతో నార్సింగ్ లోని ఓ అపార్ట్మెంట్ను పోలీసులు చుట్టుముట్టారు.
 
కాగా నయీం ఉపయోగించిన ఫోర్డ్ ఎండీవర్ వాహనాన్ని (AP 28 DR 5859) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనం వడ్డేపల్లి నర్సింగరావు పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement