నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్న అరెస్ట్

Gangster nayeem Main Follower Sheshanna was Arrested - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీముద్దీన్‌ అలియాస్‌ భువనగిరి నయీం ప్రధాన అనుచరుడిగా చలామణీ అయిన శేషన్న అలియాస్‌ రామచంద్రుడిని పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. మహాబూబ్‌నగర్‌జిల్లా అచ్చంపేటకు చెందిన శేషన్న సుదీర్ఘకాలం నయీంతో కలిసి పనిచేశారు.

నయీంకు సంబంధించిన యాక్షన్‌టీంకు నేతృత్వం వహించారు. 2016 ఆగస్టులో షాద్‌నగర్‌లో జరిగిన నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత శేషన్న అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఏపీలోని కర్నూల్‌లోనూ పలు సెటిల్‌ మెంట్లు చేస్తున్నాడు.

హైదరాబాద్‌లోని హుమాయున్‌నగర్‌లో నమోదైన కేసులో శేషన్న వాంటెడ్‌గా ఉన్నాడు. ఇతడిని పోలీసులు సోమవారం రాత్రి బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 1 నుంచి అదుపులోకి తీసుకున్నారు. కొన్నాళ్లుగా ల్యాండ్‌ సెటిల్‌మెంట్లు చేస్తున్న శేషన్న దగ్గరి నుంచి పలు డాక్యుమెంట్లతో పాటు 9 ఎంఎం పిస్టల్‌ స్వాధీనం చేసుకున్నారు.  

చదవండి: (‘జనసేన నాయకులు అన్యాయం చేశారు’) 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top