త్వరలో నూతన ఎన్‌సీసీ బెటాలియన్లు | Soon new NCC battalions | Sakshi
Sakshi News home page

త్వరలో నూతన ఎన్‌సీసీ బెటాలియన్లు

Apr 17 2017 11:47 PM | Updated on Sep 5 2017 9:00 AM

త్వరలో నూతన ఎన్‌సీసీ బెటాలియన్లు

త్వరలో నూతన ఎన్‌సీసీ బెటాలియన్లు

కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొత్తగా ఎన్‌సీసీ బెటాలియన్లు ప్రారంభించనున్నట్లు ఎన్‌సీసీ గ్రూప్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఎయిర్‌ కమ్‌డోర్, ఏపీ, తెలంగాణా రాష్ట్రాల డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ పి.మహేశ్వర్‌ చెప్పారు.

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొత్తగా ఎన్‌సీసీ బెటాలియన్లు ప్రారంభించనున్నట్లు ఎన్‌సీసీ గ్రూప్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఎయిర్‌ కమ్‌డోర్, ఏపీ, తెలంగాణా రాష్ట్రాల డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ పి.మహేశ్వర్‌ చెప్పారు. సాంవత్సరిక తనిఖీల్లో భాగంగా సోమవారం ఆయన నగరంలోని ఎన్‌సీసీ క్యాంటీన్‌ను సందర్శించారు. క్యాంటీన్‌లోని స్టాక్‌ వివరాలను, వినియోగదారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎన్‌సీసీ ట్రూప్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వెంట గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ పీజీ కృష్ణ, క్యాంటీన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ఎస్‌ఎన్‌ ఐతాల్, మేనేజర్‌ కేపీ నాయుడు తదితరులు ఉన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement