ఎన్‌సీసీ వ్యవస్థాపకుడు ఏవీఎస్ రాజు మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి | YS Jagan Mohan Reddy Condoles AVS Raju Death | Sakshi
Sakshi News home page

ఎన్‌సీసీ వ్యవస్థాపకుడు ఏవీఎస్ రాజు మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

Oct 13 2026 11:11 PM | Updated on Oct 13 2026 11:25 PM

YS Jagan Mohan Reddy Condoles AVS Raju Death

ఆంధ్రప్రదేశ్‌, తాడేపల్లి: ఎన్‌సీసీ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఏవీఎస్ రాజు మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిర్మాణ, మౌలిక వసతుల రంగాల్లో సుదీర్ఘకాలం విశేష సేవలందించిన ఆయన.. ఎన్‌సీసీ సంస్థను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

ఏవీఎస్ రాజు చేసిన సేవలు చిరస్మరణీయమని జగన్ అన్నారు. ఆయన ప్రతిభ, కృషికి గుర్తింపుగానే పద్మశ్రీ పురస్కారం లభించిందని తెలిపారు. అలాంటి వ్యక్తి మరణం నిర్మాణ రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏవీఎస్ రాజు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏవీఎస్ రాజు కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, ఎన్‌సీసీ సంస్థ ప్రతినిధులకు జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement