ఆక్సా బ్లేడుతో తల్లి గొంతు కోశాడు | son killed his mother in vizianagaram | Sakshi
Sakshi News home page

ఆక్సా బ్లేడుతో తల్లి గొంతు కోశాడు

Jun 15 2017 1:20 PM | Updated on Jul 30 2018 8:37 PM

విజయనగరం జిల్లా జామి గ్రామంలో గురువారం ఉదయం దారుణం జరిగింది.

జామి: విజయనగరం జిల్లా జామి గ్రామంలో గురువారం ఉదయం దారుణం జరిగింది. మతిస్థిమితం లేని కుమారుడు కన్నతల్లిని హతమార్చాడు.  పారాబి మాణిక్యం(50) అనే మహిళను ఆమె కుమారుడు సత్తిబాబు గురువారం వేకువజామున నిద్రపోతున్న తల్లిపై దాడి చేసి  ఆక్సా బ్లేడుతో గొంతుకోసి చంపేశాడు. సత్తిబాబు కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడు.

గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement