మెదక్ జిల్లా పెద్దశంకరం పేట మండలం మక్త లక్ష్మాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది
పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరం పేట మండలం మక్త లక్ష్మాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ డబ్బు తనకు ఇవ్వాలని గొడవపడిన కొడుకు.. తండ్రిని కొట్టి చంపాడు. వివరాల్లోకి వెళితే.. తాగిన మైకంలో పింఛన్ డబ్బులకోసం జి.ఆగమయ్య(65) అనే వృద్ధుడిని అతడి చిన్న కొడుకు రాములు బుధవారం అర్థరాత్రి తీవ్రంగా కొట్టాడు. తీవ్రగాయాలపాలైన ఆగమయ్య అక్కడికక్కడే మరణించాడు. తండ్రి మృతి చెందిన విషయం గమనించిన రాములు పరారయ్యాడు. రాములు రెండు నెలల క్రితమే ఓ సారి జైలుకు వెళ్లి వచ్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.